Telangana Assembly:"అచ్చోసిన ఆంబోతులు"...కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడిగా వేడిగా జరుగుతున్నాయి.  ప్రతిపక్ష నేత కేటీఆర్ మాటలకు సీఎం రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా సమాధానాలు ఇచ్చారు.  నా రిప్లై గురించి బీఆర్ఎస్ తహతహలాడుతోంది అంటూ ప్రతిపక్ష నేత కేటీఆర్ కు కౌంటర్ లు వేశారు.

New Update
Telangana Assembly:"అచ్చోసిన ఆంబోతులు"...కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

గవర్నర్ ప్రసంగానికి ధ్యవాదాలు తెలిపే తీర్మానం మీద తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ జరుగుతోంది. కొంతమంది ఎన్నార్ఐలకు ప్రజాస్వామిక స్ఫూర్తి అంటే అర్ధం కావడం లేదని...మనం ఎంత ప్రయత్నం చేసినా తెలుసుకోలేరని అన్నారు. ప్రజాస్వామ్యంలో 51 శాతానికే విలువ ఉంటుందని...49 శాతం విలువ సున్నా అని వివరించారు. ఇది తెలియాలంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంటాడని చురకలంటించారు. కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటీ మీద పోరాడింది కేంగ్రెస్ నేతలే. అప్పుడు పోతిరెడ్డి పాగు ప్రాజెక్టు గురించి పీజేఆర్ మాట్లాడినప్పుడు ఇక్కడ కూర్చున్న నేతలు ఏం చేస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలను ఎన్ఆర్ఐలంటూ యద్దేవా చేశారు. మేనేజ్ మెంట్ కోటాలో కేసీఆర్ ఇక్కడకు వచ్చారని కౌంటర్ వేశారు. ఆయనకు ఎంపీగా, కేంద్రమంత్రిగా చేసింది కాంగ్రెస్సేనని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. గత చరిత్ర గురించి మాట్లాడుకుందాం అంటే రండి...మీ వైపు ఉన్నవాళ్ళ చరిత్రను బయటకు తీద్దాం. ఒకరోజు సమయం ఇవ్వండి తీరిగ్గా అన్ని విషయాలు మాట్లాడుకుందాం అన్నారు రేవంత్ రెడ్డి. ఐదేళ్ళ సమయం ఉంది..ఎవరెవరు ఏమేమి చేశారో అన్నీ మాట్లాడుకుందాం. తొమ్మిదేళ్ళ పాలనలో బీఆర్ఎస్ ఏం జరిగిందో ఎక్స్ రే తీసినట్టుగా బయటపెడతాం అని కూంటర్లు వేశారు. అచ్చోసిన ఆంబోతుల్లా వస్తాం..పోడియం దగ్గర మాట్లాడతాం అనడం సరైనది కాదని చురకలు వేశారు.

Also Read:‘సిగ్గుపడుతున్నాం..’ గవర్నర్‌ ప్రసంగంపై అసెంబ్లీలో కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు!

సీఎం రేవంత్ రెడ్డి మాటలకు ప్రతిపక్ష నేత కేటీఆర్ కూడా గట్టిగానే సమాధానమిచ్చారు. ఎవరు ఎన్ఆర్ఐల గురించి మాట్లాడుతున్నారు. భారతదేశంలో ఎవరూ లేనట్టు మరో దేశం నుంచి అధ్యక్షురాలిని తెచ్చుకున్న కాంగ్రెస్సా ఎన్ఆర్ఐల గురించి మాట్లాడుతోంది అంటూ యద్దేవా చేశారు. నేను ఒక్కడిని మాట్లాడుతుంటే ఐదుగురు నా మీద పడడం స్త్రం మర్యాద అంటూ ప్రశ్నించారు. బాధ్యాయుతమైన పదవిలోకి వచ్చిన తర్వాత అయినా మర్యాదగా మాట్లాడతారు అనుకున్నాం కానీ అచ్చోసిన ఆంబోతులు అంటూ మాట్లాడడం ఏం సభ్యతని ప్రశ్నించారు కేటీఆర్. చీమలు పెట్టిన పుట్టల్లోకి పాములు దూరాయి అని చెబుతున్నారు. ఇక్కడ ఎవరు పాములో అందరికీ తెలుసంటూ రిప్లై ఇచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు