CM Kejriwal: కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. మరోసారి అసెంబ్లీలో విశ్వాస తీర్మానం

మరోసారి బలపరీక్షకు సిద్ధమయ్యారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. రేపు అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. గత ఏడాది మార్చిలో కూడా విశ్వాస తీర్మానం పెట్టి తన మెజార్టీ నిరూపించుకున్న కేజ్రీవాల్.. మరో బలపరీక్షకు సిద్ధం కావడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

New Update
Kejriwal Arrested : ఢిల్లీ సీఎం ఎవరు? కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతారు?

CM Kejriwal: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ లోక్ సభ ఎన్నికలకు (Lok Sabha Elections) ముందు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోసారి అసెంబ్లీలో విశ్వాస తీర్మానం (Motion Of Confidence) ప్రవేశ పెట్టేందుకు సిద్ధమయ్యారు. రేపు ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై నేతల మధ్య చర్చ జరగనుంది. ఇటీవల బీజేపీ పై (BJP) సంచలన కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను (AAP MLA's) బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. తాజాగా అసెంబ్లీలో తన బలాన్ని మరోసారి నిరూపించుకోనున్నారు. గత ఏడాది మార్చిలో కూడా విశ్వాస తీర్మానం పెట్టి మెజార్టీ నిరూపించుకున్న కేజ్రీవాల్.. మరో బలపరీక్షకు సిద్ధమయ్యారు. మరి తన పార్టీ ఎమ్మెల్యేలు తనవైపు ఉంటారా? లేదా బీజేపీకి మొగ్గుచూపుతారా? అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.

ALSO READ: నాలుక మడతపడకుండా చూస్కో.. లోకేష్‌కు మంత్రి అంబటి కౌంటర్

బీజేపీపై ఆరోపణలు..

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) ని కూల్చేందుకు బీజేపీ(BJP) ప్రయత్నిస్తోందని అన్నారు. ఢిల్లీలో ఆపరేషన్ లోటస్‌కు బీజేపీ తెరతీస్తోందని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే తనకు అరెస్ట్ చేయిస్తామని తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ బెదిరిస్తోందని ఆరోపణలు చేశారు. అప్పుడు ఆప్ ప్రభుత్వం కూలిపోతుందని… దాని తర్వాత బీజేపీ పార్టీ నుంచి ఆప్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తామని ప్రలోభ పెడుతున్నారని పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలు ఏడుగురిని బీజేపీ కొనడానికి చూసిందని కేజ్రీవాల్ అన్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 25 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టిందని తెలిపారు.

ఆరోసారి ఈడీ నోటీసులు..

ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, ఈడీ మధ్య పంచాయితీ ఇంకా తెగలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు (Delhi Liquor Scam Case) ఎదురుకుంటున్న విచారించేందుకు ఈడీ కేజ్రీవాల్ కు నోటీసులు పంపుతున్న.. కేజ్రీవాల్ (Arvind Kejriwal) మాత్రం ఈడీ ఇచ్చిన నోటీసులను పక్కకి పెట్టి తన రాజకీయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఆరో సారి కూడా లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ కేజ్రీవాల్ కు నోటీసులు పంపింది. ఈ నెల 19న ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే… ఐదు సార్లు ఈడీ నోటీసులు (ED Notices) పంపిన పట్టించుకోని కేజ్రీవాల్.. విచారణకు హాజరు అవుతారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

ALSO READ: రాజీనామా చేస్తా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

DO WATCH:

Advertisment
తాజా కథనాలు