గూగుల్‌లో కేసీఆర్, రేవంత్ పేర్లతో జోరుగా సెర్చింగ్.. ఈ ప్రశ్నలే ట్రెండింగ్!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డిల గురించి గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు నెటీజన్లు. అలాగే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోలు, అభ్యర్థుల గురించి కూడా ఎక్కువగా శోధిస్తున్నారు.

New Update
CM Revanth Reddy: బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కు... మేడిగడ్డ పనికిరాదు.. సీఎం రేవంత్ గరం

మరోనెల రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతూ దూకుడు పెంచుతున్నాయి. సభలు, సమావేశాలతో ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే గట్టి పోటీ ఉండనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల గురించి గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు నెటీజన్లు. ముఖ్యంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల గురించి గూగుల్‌లపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ గురించి గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు బీజేపీ నేతలైన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్‌ల గురించి మాత్రం అంతగా గూగుల్‌లో శోధన చేయడం లేదని అంటున్నాయి.

ఆన్‌లైన్‌ ట్రెండింగ్ అనేది ఆ వ్యక్తి పాపులారిటీని ప్రత్యక్షంగా సూచించడమే కాకుండా.. ప్రస్తుత పరిస్థితులనూ కూడా పరోక్షంగా సూచినస్తాయని ఎన్నికల వ్యూహకర్త, డిజిటల్ మార్కెటర్ రామ్ సుభాష్ యాదవ్ చెబుతున్నారు. సాధారణంగా రాజకీయాల కంటే క్రికెట్, సినిమాలు, ఫెస్టివల్స్ లాంటి వాటిని గూగుల్‌లో ఎక్కువ సెర్చ్ చేస్తారని.. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు, వాటి మేనిఫెస్టోలు, అభ్యర్థుల జాబితాలను నెటీజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారని తెలిపారు. గత నెలలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల కంటే కాంగ్రెస్‌ గురించి ఎక్కువగా సెర్చ్ చేసినప్పటికీ.. రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్‌ గురించే ఎక్కువగా శోధిస్తున్నట్లు చెప్పారు.

Also read: బండి వర్సెస్ ఈటల.. ఆ మూడు సీట్ల కోసం ఫైట్!

Also read: ఇక పర్మినెంట్ గా కాంగ్రెస్ లోనే ఉంటా.. అక్కడి నుంచే పోటీ చేస్తా: వివేక్

కేసీఆర్‌కు సంబంధించి.. పార్టీ మెనిఫెస్టోలు, లైవ్‌ స్పీచ్‌లు, ఆరోగ్య శ్రీ పథకం, ఆయన వయస్సు గురించి గూగుల్‌లో వెతుకుతున్నారు. ఇక రేవంత్ విషయంలో.. ఆయనకు సంబంధించిన పాటలు, ఆర్‌ఎస్‌ఎస్‌తో ఆయన సంబంధంపై వస్తున్న ఆరోపణలు, వయస్సు గురించి శోధిస్తున్నారు. ఇక బీఆర్‌ఎస్, కేసీఆర్ గురించి మెదక్, వరంగల్, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లా వాసులు ఎక్కువగా సెర్చ్ చేస్తుండగా.. నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల నుంచి రేవంత్ గురించి సెర్చ్ చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ మేనిఫోస్టో, ఆ పార్టీ అభ్యర్థుల గురించి మాత్రమే కాకుండా.. ఆ పార్టీ నేతలు మధుయాష్కీ గౌడ్, బండి రమేష్, తోటకూర విజ్రేష్ యాదవ్, ఆడమ్ సంతోష్ కుమార్ కుమార్‌ల గురించి కూడా ఎక్కువగా సెర్చు చేస్తున్నట్లు రామ్ సుభాష్ తెలిపారు.

సూర్యపేట, ఖమ్మం, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సికింద్రాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్‌కర్నూల్ ప్రాంతాల నుంచి కాంగ్రెస్‌ గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. అక్టోబర్‌ 15న సీఎం కేసీఆర్‌ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించినప్పుడు దీని గురించి సెర్చ్ చేయడం పీక్ లెవెల్‌లోకి వెళ్లిపోయింది. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎక్స్‌ (ట్విట్టర్) అకౌంట్‌ను ఎక్కవగా సెర్చ్ చేస్తున్నారు. బీజేపీ మొదటి అభ్యర్థుల జాబితాతో సహా.. ఆ పార్టీ ప్రతినిధి రాణి రుద్రమదేవీ, అలాగే సిరిసిల్లలో కేటీఆర్‌తో పోటీకి దిగే బీజేపీ నేత ఎవరూ అనే దానిపై నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. అలాగే బీజేపీ ఫ్రీ రిచార్జి యోజనకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని కూడా సెర్చ్ చేస్తున్నారు. భైంసా, కోనాపూర్, జగిత్యాల, నాగన్‌పల్లి, గనోరా, మేకగూడ ప్రాంతాల నుంచి ఎక్కవగా బీజేపీ గురించి సెర్చ్ చేస్తున్నట్లు రామ్ సుభాష్‌ వివరించారు.

Advertisment