ముంపు మండలాల్లో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..

వరద ప్రభావిత, ముంపు మండలాల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పర్యటించనున్నారు. సోమ, మంగళ వారాల్లో రెండు రోజుల పాటు అల్లూరి సీతారామ రాజు జిల్లా, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి. సోమవారం ఉదయం 9:30 నిమిషాలకు తాడేపల్లి నుంచి సీఎం బయలు దేరనున్నారు. 10:30 గంటలకు అల్లూరి సీతారామ రాజు జిల్లా కూనవరం మండలం కోతుల గుట్ట గ్రామానికి ముఖ్యమంత్రి..

ముంపు మండలాల్లో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
New Update

వరద ప్రభావిత, ముంపు మండలాల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పర్యటించనున్నారు. సోమ, మంగళ వారాల్లో రెండు రోజుల పాటు అల్లూరి సీతారామ రాజు జిల్లా, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి. సోమవారం ఉదయం 9:30 నిమిషాలకు తాడేపల్లి నుంచి సీఎం బయలు దేరనున్నారు. 10:30 గంటలకు అల్లూరి సీతారామ రాజు జిల్లా కూనవరం మండలం కోతుల గుట్ట గ్రామానికి ముఖ్యమంత్రి చేరుకోనున్నారు.

కోనవరం బస్టాండ్ సమీపంలో వేదిక దగ్గర వరద బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. ఆ తర్వాత కూనవరం, వీఆర్ పురం మండలాల బాధితులతో సీఎం ఇంటరాక్షన్ అవ్వనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కుక్కునూరులోని గుమ్ముగూడెం గ్రామానికి సీఎం చేరుకుంటారు. అక్కడ అరగంట పాటు గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం నాలుగున్నర గంటలకు రాజమండ్రి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు సీఎం జగన్ చేరుకోనున్నారు.

రాజమండ్రి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో స్థానిక నాయకులతో సమావేశం అవుతారు. రాత్రిని రాజమండ్రిలోనే విడిది చేయనున్నారు జగన్. ఇక మంగళవారం ఉదయం 10 గంటలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడి వరం మండలం గురజపు లంకకు చేరుకుని, అక్కడ వరద బాధిత కుటుంబాలను సీఎం పరామర్శించనున్నారు. అనంతరం రామాలయంపేట గ్రామం తానేలంకకు చేరుకుని.. అయినవిల్లి మండలం, తోటరాముడివారిపేటలో బాధితులతో సీఎం ఇంట్రాక్షన్ కానున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తాడేపల్లికి ముఖ్యమంత్రి సీఎం జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు.

కాగా ఆగష్టు 3వ తేదీన వరద ప్రభావిత ప్రాంతాలపై జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు సీఎం. వరద బాధిత ప్రాంతాల్లో సమర్థవంతంగా సహాయ పునరావాసం కార్యక్రమాలు జరగాలన్నారు. విమర్శలకు తావులేకుండా చూడాలని చెప్పారు. వరద సహాయ కార్యక్రమాల్లో ఉదారంగా వ్యవహరించండని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మనం ఆ పరిస్థితుల్లో ఉంటే ఎలాంటి సహాయం కోరుతామో.. అలాంటి సహాయమే అందించాలన్నారు. ఇంట్లోకి వరదనీరు వచ్చినా, అలాగే వరద కారణంగా సంబంధాలు తెగిపోయిన వారికి ఖచ్చితంగా నిర్ణయించిన రేషన్‌ అందించాలన్నారు. దీంతో పాటు తాగునీరు కూడా అందించాలని సూచించారు. సహాయం అందని వరద బాధిత కుటుంబం ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు.

#andhra-pradesh #ap-news #cm-jagan #political-news #two-days #andhra-pradesh-cm-jagan #flood-affected-ares
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe