CM JAGAN: అందుకే విశాఖనే ఏపీకి రాజధాని.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
విభజన సమయంలో ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని అన్నారు సీఎం జగన్. ప్రతీ రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌజ్ ఉండాలని అన్నారు. ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్‌ను కోల్పోయామని.. అందుకే విశాఖ గురించి పదే పదే చెబుతున్నట్లు తెలిపారు.
CM JAGAN: తెలుగు రాష్ట్రల విభజన సమయంలో ఏపీకి (Andhra Pradesh) తీరని అన్యాయం జరిగిందని అన్నారు సీఎం జగన్. గత ప్రభుత్వ (TDP Government) విధానాల వల్ల కూడా బాగా నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ (State Economy) కుదేలు అయ్యిందని.. గత ప్రభుత్వ విధానాల వల్ల విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత లాంటి రంగాలు కుదేలయ్యాయని అన్నారు.
రైతులను చంద్రబాబు (Chandra Babu) మోసం చేశారని ఫైర్ అయ్యారు సీఎం జగన్. ఐదేళ్లలో చంద్రబాబు రైతులకు రూ.15వేలకోట్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. పొదుపు సంఘాల వడ్డీ కూడా మాఫీ చేయలేదని ఫైర్ అయ్యారు. 2015-19 మధ్య కేంద్రం ఇచ్చిన పన్నుల వాటా కేవలం 31.5 శాతమే అని పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం 41 శాతం సిఫారసు చేసిన మనకు 31 శాతం మాత్రమే దక్కిందని అన్నారు. చంద్రబాబు హయాంలో 35 శాతం వరకైనా తగ్గిందని.. మేము అధికారంలోకి వచ్చేటప్పటికీ బాగా తగ్గిపోయాయని అన్నారు.
చంద్రబాబు మంచి చేయలేదు..
కేంద్రం కంటే రెట్టింపు స్థాయిలో బాబు అప్పులు తెచ్చాడని ఆరోపణలు చేశారు సీఎం జగన్. కానీ, ఎక్కువ అప్పులు చేశామని మన మీద అబద్ధాల బ్యాచ్ ప్రచారం చేస్తోందని అన్నారు. మన హయాంలో కేంద్ర ప్రభుత్వం 6.5 శాతం అప్పులు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు 5.2 శాతం మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. ఏ రకంగా చూసినా గత ప్రభుత్వానికి, మనకూ ఎంత వ్యత్యాసముందో చెప్పేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని అన్నారు. ఈ మాత్రం చేయగలిగామనేందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. జనాలకు మంచి చేశామన్న సంతృప్తి తమకు ఉందని తెలిపారు.
అందుకే విశాఖే రాజధాని..
ప్రతీ రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌజ్ ఉండాలని అన్నారు సీఎం జగన్. అలాంటి పవర్‌హౌజ్ లేకపోతే రాష్ట్ర ఆదాయాలు ఎప్పటికీ పెరగవని తెలిపారు. ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్‌ను కోల్పోయాం అని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ రెవెన్యూ లోటు వెంటాడుతోందని అన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం తగ్గిపోయిందని పేర్కొన్నారు. అందుకే విశాఖ గురించి పదే పదే చెబుతున్నానని గుర్తు చేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఎదగడానికి పెద్ద పెద్ద నగరాలు అవసరం అని అన్నారు. ఓ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు ఉండాలని తెలిపారు.

ALSO READ: ఢిల్లీకి చంద్రబాబు.. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు?
చంద్రబాబు మోసం చేశారు..

ALSO READ: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. గ్రూప్-1 పోస్టులు పెంపు
DO WATCH: