Janasena: జనసేనలో ఒక్కసారిగా భగ్గుమన్న విభేదాలు

AP: జనసేనలో ఒక్కసారిగా నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ ముఖ్య అనుచరులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఓ కార్యక్రమానికి రెండు వర్గాల నాయకులు హాజరు కాగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు ఆపినా ఆగలేదు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

Janasena: జనసేనలో ఒక్కసారిగా భగ్గుమన్న విభేదాలు
New Update

Janasena Clashes : జనసేన (Janasena) లో ఒక్కసారిగా విభేదాలు భగ్గుమన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా (Ambedkar Konaseema District) రాజోలు (Razole) లో నాయకుల మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. రెండువర్గాలుగా చీలి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు చేసుకున్నారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ముఖ్య అనుచరులు రెండుగా విడిపోయారు. కొద్ది రోజులుగా సోషల్ మీడియా (Social Media) వేదికగా రెండువర్గాలకు వార్ నడుస్తోంది. NRI వెంకటపతి రాజుకి, జనసేన నాయకులు బాలాజీ, బుజ్జి వర్గానికి ఎన్నికల నాటినుంచి వివాదం కొనసాగుతోంది.

ఎన్నికల తర్వాత ఓ బర్త్‌ డే కార్యక్రమానికి ఒకే వేదికపై రెండువర్గాలు వచ్చాయి. NRI వెంకటపతి రాజు రావడంతో వ్యతిరేక వర్గం ఆగ్రహించింది. వెంకటపతి రాజుపై ఒక్కసారిగా నాయకులు దాడికి దిగారు. మరోవర్గం అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ జరిగింది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా నాయకులు ఆగలేదు. గొడవ జరిగే సమయంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అందుబాటులో లేరు.

Also Read : కేసీఆర్‌తో కటీఫ్.. కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే

#janasena #ambedkar-konaseema-district #social-media #razole
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe