BRS Party: కేసీఆర్‌తో కటీఫ్.. కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే

TG: బీఆర్ఎస్ పార్టీని వరుస ఎమ్మెల్యేల రాజీనామాలు వెంటాడుతున్నాయి. తాజాగా మరో ఎమ్మెల్యే కేసీఆర్‌కు కటీఫ్ చెప్పారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇప్పటికే 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే

New Update
BRS Party: కేసీఆర్‌తో కటీఫ్.. కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే

BRS Party: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సొంత పార్టీ ఎమ్మెల్యేలు వరుస షాకులు ఇస్తున్నారు. కాంగ్రెస్‌లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేరబోతున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో చేరికకు ప్లాన్‌ చేసినట్లు సమాచారం. నిన్ననే చేరాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల చేరలేకపోయారు. ఇప్పటికే కాంగ్రెస్‌లో 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరారు. నిన్ననే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌. ఎమ్మెల్యే గాంధీతోపాటు కాంగ్రెస్‌లో కార్పొరేటర్లు, నేతలు ఈరోజు చేరనున్నట్లు తెలుస్తోంది.

నిన్న ఒకరు..

బీఆర్ఎస్ కు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బిగ్ షాక్ ఇచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కార్పోరేటర్లతో కలిసి ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. రేవంత్ రెడ్డి ప్రకాష్ గౌడ్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో బీఆర్ఎస్ ను వీడిని ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది. ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 30కి పడిపోయింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు