Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు లైవ్.. కన్నీటి వీడ్కోలు
సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ రావు మృతితో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహిస్తున్నారు.
సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ రావు మృతితో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహిస్తున్నారు.
తెలుగు సినిమా చరిత్రలో కోట శ్రీనివాస్ రావు- బాబు మోహన్ జంటకు ప్రత్యేక స్థానం ఉంది. తెరపై కలిసి నవ్వులు పంచిన ఈ ఇద్దరు స్నేహితులు.. వ్యక్తిగత జీవితంలోనూ ఒకే రకమైన తీరని విషాదాన్ని చవిచూశారు.
కోట శ్రీనివాస్ నటన మాత్రమే కాదు పలు సినిమాల్లో ఆయన స్వరం వినిపించి కూడా అలరించారు కోట. అవును.. కోట రెండు, మూడు సూపర్ హిట్ సినిమాల్లో పాటలు కూడా పాడారు.
'మోనికా' స్పెషల్ సాంగ్ లో పూజతో పాటు ఎనర్జిటిక్ స్టెప్పులతో అందరి దృష్టిని ఆకర్షించాడు మలయాళ నటుడు సౌబిన్ షాహిర్! అతడి ఫ్లోలెస్ డాన్స్ మూవ్స్ నెటిజన్లను ఆశ్చర్యపరిచాయి.
ఓ టైమ్ లో అక్కినేని నాగేశ్వరరావుతో సరదాగా మాట్లాడిన సంబాషణను ఆయన ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. అక్కినేని, నాగార్జున కలిసి నటించిన సినిమా ఇద్దరూ ఇద్దరే. ఈ సినిమా గురించి బయట ఏం అనుకుంటున్నారు అని అక్కినేని కోటను అడిగారట.
విలక్షణ నటుడు కోట మృతి అభిమానులకు, సినీ పరిశ్రమకు తీరని విషాదాన్ని మిగిల్చింది. కోట పాతతరం నటుడైనప్పటికీ ఎన్నో అద్భుతమైన పాత్రల్లో ఆయన పలికించిన డైలాగులు, ఆయన చూపిన ఎక్స్ప్రెషన్స్ ఇప్పటికీ మీమ్స్ రూపంలో ట్రెండ్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
వయోభారం కారణంగా ఆయన చివర్లో సినిమాలకు దూరమయ్యారు. కానీ ఏ నటుడికి అయిన తాను చనిపోయే వరకు సినిమాల్లో నటించాలని కోరిక ఉంటుంది. అలాగే కోట కూడా నటించాలని అనుకున్నారు. కానీ వయోభారం కారణంగా ఆయనకు ఆవకాశాలు ఎవరూ ఇవ్వలేదు.
కోట శ్రీనివాసరావు మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న కోట శ్రీనివాసరావు మరణం విచారకరమని ఎమోషనల్ అయ్యారు.