/rtv/media/media_files/2025/11/17/prithviraj-sukumaran-2025-11-17-16-55-22.jpg)
Prithviraj Sukumaran
Prithviraj Sukumaran: మలయాళ స్టార్ హీరో, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న కొత్త చిత్రం ‘విలాయత్ బుద్ధ’ ఇప్పటికే మంచి హైప్ తెచ్చుకుంది . తాజాగా వచ్చిన ట్రైలర్‌లో ఆయన ‘డబుల్ మోహన్’ అనే ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించిన పాత్రలో కనిపించిన తర్వాత, ఈ మూవీపై ఆసక్తి మరింత పెరిగింది.
ట్రైలర్‌లో ఉన్న స్టైల్, కథ నేపథ్యం చూసి చాలామంది ప్రేక్షకులు ఈ సినిమాను అల్లు అర్జున్ సూపర్‌హిట్ చిత్రం ‘పుష్ప’తో పోల్చడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో “విలాయత్ బుద్ధ పుష్ప కాపీనా?” అనే కామెంట్లు కూడా వచ్చాయి. ఈ వ్యాఖ్యలు హీరో పృథ్వీరాజ్ దృష్టికి కూడా వెళ్లాయి. అయితే ఆయన ఈ పోలికలను సరదాగా తీసుకోకుండా, క్లారిటీ ఇచ్చారు.
“మా సినిమా పుష్ప తర్వాత వచ్చిందని అనుకోవడం తప్పు” - పృథ్వీరాజ్
ఈ వివాదంపై మాట్లాడిన పృథ్వీరాజ్ ఇలా చెప్పారు.. “విలాయత్ బుద్ధ కథను మేము పుష్ప రిలీజ్‌కి చాలా ముందే ప్రారంభించాం. ఈ ప్రాజెక్ట్ చాలా కాలం నుంచి మా దగ్గర ఉంది. ఇది ఎలాంటి కాపీ కాదు. ఈ చిత్రం పూర్తిగా జీఆర్ ఇందుగోపాలన్ రాసిన నవల ఆధారంగా తీశాం.” అంతేకాదు, ఈ సినిమా జర్నీ చాలా వ్యక్తిగతంగా అనిపించిందని అన్నారు. సాచి చెప్పిన చివరి కథల్లో ఇదొకటి
పృథ్వీరాజ్ వెల్లడించిన ఆసక్తికర విషయాలు:
“అయ్యప్పనుమ్ కోషియుమ్ దర్శకుడు సాచి ఈ కథను మొదటగా నాకు చెప్పాడు. కానీ అతని ఆకస్మిక మరణంతో (2020) ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. తరువాత సాచి సహాయకుడు జయన్ నంబియార్ దర్శకత్వ బాధ్యతలు తీసుకుని ఈ సినిమాను మళ్లీ ముందుకు నడిపాడు.”
ఈ మాటలతో పృథ్వీరాజ్ 'విలాయత్ బుద్ధ’ కు పుష్పతో ఎలాంటి సంబంధం లేదని, కథ పూర్తిగా వేరని స్పష్టం చేశారు. పృథ్వీరాజ్ చేసిన ఈ క్లారిటీతో సినిమాలో ఆసక్తి మరింత పెరిగింది. ట్రైలర్‌లో ఆయన చూపించిన లుక్, క్యారెక్టర్ డిజైన్‌కు మంచి స్పందన వస్తోంది. ఎర్రచందనం నేపథ్యంలో జరిగే కొత్త కథను ఎలా చూపించబోతున్నారన్న ఆసక్తి ప్రేక్షకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
Follow Us