/rtv/media/media_files/2025/11/17/sridevi-2025-11-17-16-26-55.jpg)
Sridevi
Sridevi: టాలీవుడ్‌లో ‘కోర్ట్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీదేవి అపల్లా ఇప్పుడు వరుస ఆఫర్స్‌తో బిజీ అవుతోంది. తెలుగులో మంచి క్రేజ్ పొందిన ఆమెకు ఇప్పుడు తమిళ పరిశ్రమ నుంచి కూడా పెద్ద అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఒక తమిళ ప్రాజెక్ట్‌లో నటిస్తున్న ఆమెకి, తాజాగా కోలీవుడ్‌లో మరో కీలక అవకాశం లభించింది.
తమిళంలో ‘కోజిపన్నై చెల్లదురై’, ‘కానా కానమ్ కాలంగల్’ వంటి సినిమాలు, సిరీస్‌లతో పేరు తెచ్చుకున్న ఏగన్ హీరోగా నటిస్తున్న చిత్రానికి శ్రీదేవిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఆమెతో పాటు ‘మిన్నల్ మురళి’ చిత్రంతో గుర్తింపు పొందిన ఫెమినా జార్జ్ కూడా ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా కనిపించబోతోంది. ఈ ఇద్దరి జోడీ స్క్రీన్‌పై ఎలా ఉండబోతోందనే ఆసక్తి అభిమానుల్లో ఇప్పటికే కనిపిస్తోంది.
ఈ కొత్త తమిళ- తెలుగు ద్విభాషా చిత్రానికి ‘ఆహా కళ్యాణం’ ఫేమ్ యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల కోలీవుడ్‌లో ‘జో’ సినిమాతో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న విజన్ సినిమా హౌస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మంచి కంటెంట్‌తో సినిమాలు చేయడంలో పేరున్న ఈ బ్యానర్ నుంచి వస్తుండటంతో సినిమాపై మరింత హైప్ ఏర్పడింది.
సంగీతాన్ని విజయ్ బుల్గానిన్ అందిస్తున్నారు. ఆయన కంపోజిషన్‌కు యువ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో పాటలపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. యాక్షన్, ఫీలింగ్, ఎంటర్టైన్‌మెంట్ అన్నీ కలిసిన కమర్షియల్ సినిమా రూపంలో ఈ ప్రాజెక్ట్ ఉండనుందని టాక్.
తమిళంలో శ్రీదేవికి ఇది మంచి బ్రేక్ అవుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. వరుసగా లభిస్తున్న అవకాశాలతో ఆమె కెరీర్ ఇప్పుడు మరో దశలోకి అడుగుపెట్టబోతోందని చెప్పొచ్చు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కే ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.
తమిళ ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి బజ్ తెచ్చుకున్న ఈ ప్రాజెక్ట్, శ్రీదేవికి కోలీవుడ్‌లో స్థిరమైన మార్కెట్ తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Follow Us