/rtv/media/media_files/2025/11/17/raj-tarun-tortoise-2025-11-17-15-50-10.jpg)
Raj Tarun Tortoise
Raj Tarun Tortoise: యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న కొత్త సినిమా ‘టార్టాయిస్’ హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. ఈ సినిమాను ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్‌కే గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్, ఎన్వీఎల్ క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. రిత్విక్ కుమార్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రంలో రాజ్ తరుణ్‌తో పాటు అమృత చౌదరి హీరోయిన్‌గా కనిపించనున్నారు. అలాగే శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. పూజా కార్యక్రమం జరిగిన వెంటనే చిత్రబృందం మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. విడుదలైన పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.
ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత చంద్రబోస్ లిరిక్స్ అందిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.
పూజా కార్యక్రమంలో హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ, “టార్టాయిస్ చాలా కొత్తగా, భిన్నంగా ఉండే కథ. దర్శకుడు రిత్విక్ కథ చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది. ఈ సినిమా నా కెరీర్‌కి మంచి జోష్ ఇస్తుందని నమ్ముతున్నాను. కథను నమ్మి సినిమా చేస్తున్నారు మా నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు,” అని తెలిపారు.
అలాగే దర్శకుడు రిత్విక్ కుమార్ మాట్లాడుతూ, “మా సినిమా పూజకి వచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. టార్టాయిస్ కథ చాలా ప్రత్యేకమైనది. రాజ్ తరుణ్ గారి కెరీర్‌లో ఇది బెస్ట్ సినిమాల్లో ఒకటి అవుతుందని నమ్ముతున్నాను. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ, అమృత చౌదరి పాత్రలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. కొత్త స్క్రీన్‌ప్లే, థ్రిల్లింగ్ ఎమోషన్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుంది. త్వరలో షూటింగ్ మొదలుపెడతాం,” అని చెప్పారు.
నిర్మాతలు శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి, రామిశెట్టి రాంబాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వారు కథపై నమ్మకం పెట్టుకుని పెద్ద స్థాయిలో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని చిత్రబృందం తెలిపింది. ‘టార్టాయిస్’ చిత్రంపై ఇప్పటినుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. భిన్నమైన థ్రిల్లర్ కథతో, మంచి నటీనటులతో ఈ సినిమా రాజ్ తరుణ్ కెరీర్‌లో మరో మంచి ప్రాజెక్ట్ కావచ్చని అందరూ అభిప్రాయపడుతున్నారు.
Follow Us