iBomma Case: మా ఫ్యామిలీలో ఒకరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు - నాగార్జున షాకింగ్ కామెంట్స్

ఐబొమ్మ, బప్పం వంటి సినిమా వెబ్‌సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడిని కోర్టులో హాజరు పరిచిన హైదరాబాద్ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో ఇమ్మడి రవి సంచలన విషయాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

New Update
iBomma Case

iBomma Case

ఐబొమ్మ, బప్పం వంటి సినిమా వెబ్‌సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం అతడిని కోర్టులో హాజరు పరిచిన హైదరాబాద్ పోలీసులు తర్వాత కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో ఇమ్మడి రవి సంచలన విషయాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. 

iBomma Case

ఇదిలా ఉంటే ఇవాళ హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో సినీ ఇండస్ట్రీ పెద్దలతో భేటి జరిగింది. ఈ భేటీలో పాల్గొన్న చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు వంటి ప్రముఖులు పోలీసులను ప్రశంసించారు. అదే సమయంలో నాగార్జున తమ ఫ్యామిలీకి ఎదురైన చేదు అనుభవాన్ని ఆ భేటీలో పంచుకున్నారు. ఉచితంగా సినిమా చూపించడం అనేది ఒక ట్రాప్ అని.. ఆరు నెలల క్రితం తమ కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్‌కు గురయ్యారని తెలిపారు. ఉచితంగా సినిమా చూస్తున్నామని వెబ్‌సైట్ తెరిస్తే మన వివరాలు అన్ని వాళ్ళకి వెళ్ళిపోతాయని అన్నారు. 

నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ మా ఫ్యామిలీలో ఒక వ్యక్తికి ఆరు నెలల క్రితం డిజిటల్ అరెస్టు జరిగింది. దాదాపు రెండు రోజుల పాటు ఈ వ్యవహారం జరిగింది. ఆ తర్వాత ఈ విషయం తెలిసి పోలీసులకు చెప్పగానే.. వారు ఆన్‌లైన్‌లోకి రాగానే సైబర్ క్రిమినల్స్ వెంటనే మాయమైపోయారు. ఆ తర్వాత వారిని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు. వారు అంత పగడ్బందీగా ఉన్నారు. 

ఒక ఆర్గనైజేషన్ నడిపేవారు.. బాధితుల వీక్‌నెస్ తెలుసుకుంటారు, ఎలా లొంగదీసుకోవాలో కనుక్కుంటారు, వారిని తరచూ ట్రాక్ చేస్తూ ఉంటారు. బ్యాంక్ డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ సహా అన్ని వివరాలు హ్యాక్ చేసిన తర్వాత మోసం చేసి డబ్బులు గుంజుతారు. 

మనం తెలీకుండా ఏదో ఒక వెబ్ సైట్ బాగుంది అని చెప్పి దాన్ని క్లిక్ చేస్తుంటాం. నిజానికి ఫ్రీగా సినిమాలు చూపించడం అనేది ఒక బిగ్ ట్రాప్. వారేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు. వారి వెనుక చాలా పెద్ద ప్లాన్ ఉంటుంది. ఇలా సినిమాలు పైరసీ చేసి రూ.20 కోట్లు సంపాదించారన్నది చాలా చిన్న సొమ్ము. వాళ్ల సంపాదన వేల కోట్లల్లో ఉంటుంది. ఇమ్మడి రవి నుంచి రూ.3 కోట్లు దొరికిందని అన్నారు. అది వాళ్లకి చిన్న చిల్లర డబ్బు మాత్రమే.’’ అని నాగార్జున చెప్పుకొచ్చారు. 

Advertisment
తాజా కథనాలు