OTT Movies List: కొత్త సినిమాలొచ్చాయ్..! ఓటీటీలో ఈ వారం ఏమున్నాయంటే..?

ఈ వారం, రానున్న నవంబర్ లో OTT ప్లాట్‌ఫామ్స్‌లో 'The Family Man S3', 'Bison', Homebound, Dining with the Kapoors, Ziddi Ishq, Nadu Center, Ego వంటి కొత్త సినిమాలు, సిరీస్‌లు విడుదల కానున్నాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ప్రేక్షకులు వీటిని వీక్షించవచ్చు.

New Update
OTT Movies List

OTT Movies List

OTT Movies List: OTT ప్లాట్‌ఫామ్స్ వీకెండ్ కోసం ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి కొత్త సినిమాలు, సిరీస్ రిలీజ్ లు చాలానే ఉన్నాయ్. ఈ వీకెండ్ లో, రానున్న నవంబర్ లో  కూడా ఏం చూడవచ్చో ఒక చిన్న లిస్ట్ ఇక్కడ ఉంది చూసేయండి.

Ego:

తెలుగు షార్ట్ ఫిల్మ్ Ego ఇప్పుడు ETV Win లో Katha Sudha సిరీస్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది. Jhansi ప్రధాన పాత్రలో నటించగా, Charan Peri కూడా ముఖ్య పాత్ర పోషించారు. ఇది రివేంజ్ -కామెడీ జానర్ లో Yohith Reddy Palavali దర్శకత్వంలో రూపొందింది.

Nadu Center:

తమిళ్ స్పోర్ట్స్ డ్రామా Nadu Center నవంబర్ 20, 2025 నుంచి Jio Hotstar లో రిలీజ్ కానుంది. Naru Narayanan దర్శకత్వంలో శశికుమార్, కలయ్యరాసన్, Asha Sharath, Delhi Ganesh, కొత్త నటి, నటులు  నటించారు. కథ ఒక ఫెయిల్ అయిన బాస్కెట్బాల్ ప్లేయర్ చుట్టూ తిరుగుతుంది ఇది తెలుగు వెర్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది.

The Family Man Season 3:

భారతదేశంలో ఫుల్ ఫేమస్ అయిన స్పై థ్రిల్లర్ సిరీస్ The Family Man మూడవ సీజన్‌తో తిరిగి వస్తోంది. Manoj Bajpayee సృకాంత్ తివారి పాత్రలో కనిపిస్తారు. Raj & DK మళ్లీ ఈ షోను లీడ్ చేస్తున్నారు. Amazon Prime Video నవంబర్ 21, 2025 నుండి హిందీ, తెలుగు, ఇతర భాషల్లో స్ట్రీమ్ అవుతుంది.

Bison:

మరి సెల్వరాజ్ దర్శకత్వంలో Bison సినిమా Dhruv Vikram, Anupama Parameswaran తో Netflix లో నవంబర్ 21, 2025 నుండి స్ట్రీమ్ అవుతుంది. ఇది రూరల్ స్పోర్ట్స్ డ్రామా సినిమా, తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడలో విడుదల అవుతుంది.

The Bengal Files:

థియేట్రికల్ రిలీజ్ సక్సెస్ కాలేకపోయినా The Bengal Files ZEE5 లో నవంబర్ 21, 2025 నుండి చూడవచ్చు. మితున్ చక్రబర్తి, Pallavi Joshi, Darshan Kumar ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం తెలుగు వెర్షన్ ప్లాన్ లేదు.

Homebound:

ఇండియా ఆఫీషియల్ ఆ Oscars ఎంట్రీ Homebound Netflix లో నవంబర్ 21, 2025 నుంచి స్ట్రీమ్ అవుతుంది. Neeraj Ghaywan దర్శకత్వంలో Ishaan Khatter, Vishal Jethwa, Janhvi Kapoor ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు ఆడియో విడుదల ఉండకపోవచ్చు.

Dining with the Kapoors:

Netflix లో Dining with the Kapoors నవంబర్ 21, 2025 నుండి స్ట్రీమ్ అవుతుంది. ఇది రాజ్ కపూర్ 100 ఏళ్ల వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ కపూర్ కుటుంబ సభ్యులతో ప్రత్యేక షో. Ranbir, Kareena, Karisma, Neetu, Randhir, Saif తదితరులు పాల్గొన్నారు. తెలుగు వెర్షన్ లేదు.

Ziddi Ishq:

జనరల్ రొమాంటిక్-థ్రిల్లర్ సిరీస్ Ziddi Ishq Jio Hotstar లో నవంబర్ 21, 2025 నుండి అందుబాటులోకి రానుంది. Aaditi Pohankar, Parambrata Chattopadhyay ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రేమలో పోసిసివ్ నెస్, అతిగా ప్రేమించడం నేపథ్యంలో కథ సాగుతుంది. తెలుగు వెర్షన్ గురించి ఇంకా సమాచారం లేదు.

Advertisment
తాజా కథనాలు