BIG BREAKING: యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌ అరెస్టు

యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌ను పోలీసులు చెన్నై ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని కేసు నమోదు కావడంతో అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ బైక్ టూర్‌ కంప్లీట్ చేసి వస్తుండగా చెన్నై ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు.

New Update
Case filed against YouTuber Baiya Sunny Yadav

YouTuber Baiya Sunny Yadav

ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌ను పోలీసులు చెన్నై ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని నూతనకల్ పీఎస్‌లో ఇది వరకే కేసు నమోదైంది. ఈ క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ బైక్ టూర్‌ను పూర్తి చేసి ఇండియాకు వస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చెన్నై ఎయిర్‌పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Crime News: మధ్యప్రదేశ్‌లో విషాదం... కన్నబిడ్డను కాపాడలేనన్న భయంలో ప్రాణం విడిచిన తండ్రి

సజ్జనార్ సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేయడంతో..

భయ్యా సందీప్ అలియాస్ సన్నీ యాదవ్ అనే యూట్యూబర్ తన సోషల్ మీడియా ఖాతాలలో (టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్) ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాడని ఆరోపిస్తూ టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఫిర్యాదుతో సూర్యాపేట కమిషనరేట్‌లోని నూతన్‌కల్ పోలీస్ స్టేషన్‌లో బయ్యా సందీప్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇది కూడా చూడండి:Parcel Bomb: పెళ్లి గిఫ్ట్‌గా పార్సల్ బాంబ్.. ఇద్దరిని చంపిన లెక్చరర్‌‌కి శిక్ష ఏంటో తెలుసా?

ఐటీ చట్టం (2000-2008)లోని 111(2), 318(4), 46, r/w 61(2) BNS, 3, 4 TSGA, 66-C, 66-Dతో సహా అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యువతకు హాని కలిగించడంలో యూట్యూబర్ సన్నీ యాదవ్ ప్రమేయం ఉందని తెలిపారు.

ఇది కూడా చూడండి:Miss World 2025: తుది పోటీకి 40 మోడల్స్ సిద్ధం – మిస్ వరల్డ్ కిరీటానికి చివరి పోరు మొదలు!

కాగా సన్నీ యాదవ్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రముఖ యూట్యూబర్‌గా ఉంటున్నాడు. బైక్ రైడ్ వీడియోలతో చాలా మంది సబ్‌స్క్రైబర్‌లను పొందుతూ డబ్బు సంపాదిస్తున్నాడు. అయితే అతడు మరింత సంపాదించాలనే ఉద్దేశంతో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ నిర్వహకులతో కుమ్మక్కయ్యాడని సజ్జనార్ ఆరోపించారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేశారు.

ఇది కూడా చూడండి:Pahalgam Terrorist Attack: బయటకొచ్చిన షాకింగ్ నిజాలు.. పహల్గామ్ అటాక్ ప్లానింగ్ ఎవరిదంటే..?

Advertisment
తాజా కథనాలు