/rtv/media/media_files/2025/04/17/GzatzMoW78olPHSDpuxC.jpg)
Manchu Lakshmi Instagram hack
Manchu Lakshmi: ఈ మధ్య డిజిటల్ మోసాలు బాగా పెరిగిపోయాయి. సోషల్ మీడియా అకౌంట్లు చేసి డబ్బులు రాబడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఇప్పుడు నటి మంచు లక్ష్మీ కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. తాజాగా మంచు లక్ష్మీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఆమె ఇన్ స్టాలో ట్రేడింగ్ కి సంబంధించిన పోస్టులు దర్శనమిచ్చాయి. ఈయాప్ లో ఇన్వెస్ట్ చేస్తే ఈజీగా డబ్బులు సంపాదించవచ్చని, నేను కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను అని ఆమె ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ పెట్టారు హ్యాకర్లు.
My Instagram has been hacked. Kindly do not engage with anything that is on my stories.
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) April 17, 2025
If I need money, I will ask you directly not on social media 😂
Will tweet once I get it all back in order…
రిప్లై ఇవ్వొద్దు
దీంతో మంచు లక్ష్మీ తన ఫాలోవర్లను అప్రమత్తం చేశారు. తన అకౌంట్ నుంచి వచ్చే ఎలాంటి మెసేజ్ లకు రిప్లై ఇవ్వదంటూ సూచించారు. ముఖ్యంగా డబ్బులు కావాలని అడిగితే స్పందించవద్దని తెలిపింది. తన స్టోరీలో కనిపించే పోస్టులను దూరంగా ఉండాలని సూచించింది. ఇన్ స్టాగ్రామ్ రికవరీ అయిన తర్వాత మళ్ళీ ట్వీట్ చేస్తానని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
My Instagram account is hacked.@instagram help me in getting it back. pic.twitter.com/oUGE1LXo9w
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) April 17, 2025
cinema-news | telugu-news | latest-news