అసభ్యకర స్టెప్పులేస్తే దబిడి దిబిడే.. ఫిల్మ్ ఇండస్ట్రీకి మహిళా కమీషన్ వార్నింగ్

సినిమాల్లో మహిళలను కించపరిచే విధంగా డాన్స్ స్టెప్పులను ఉపయోగించడంపై తెలంగాణ మహిళా కమీషన్ సినీ పరిశ్రమకు హెచ్చరికలు జారీచేసింది. దర్శక, నిర్మాతలు మహిళలను తక్కువ చేసి చూపించే, అసభ్యకరమైన డాన్స్ స్టెప్స్‌ను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది.

New Update
dabidi dibidi song

Women Welfare Commission: తెలంగాణ మహిళా కమీషన్  సినీ పరిశ్రమకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ''ఇటీవల వచ్చిన పలు తెలుగు సినిమాల్లోని డ్యాన్స్ స్టెప్పులు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో దర్శక, నిర్మాతలు మహిళలను తక్కువ చేసి చూపించే, అసభ్యకరమైన డాన్స్ స్టెప్స్‌ను వెంటనే నిలివేయాలని.. లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. యువత, పిల్లలపై సినిమాలు చూపించే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, సినిమా పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపించే శక్తివంతమైన మాధ్యమం.   ఇందులో మహిళలను అవమానించే లేదా అసభ్యకరంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని మహిళా కమీషన్ పేర్కొంది. 

Also Read: Shekar Master: నీ భార్యతో ఇలానే చేయిస్తావా? శేఖర్ మాస్టర్ పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

Also Read: Betting App Case: బెట్టింగ్ యాప్స్‌ కేసు.. సెలబ్రిటీలపై ఫిల్మ్‌ఛాంబర్ షాకింగ్ రియాక్షన్..

దబిడి, దిబిడి, అదిదా సర్‌ప్రైజ్ పాటలపై ట్రోల్స్ 

 అయితే ఇటీవలే విడుదలైన బాలయ్య  డాకుమహారాజ్ సినిమాలోని  'దబిడి, దిబిడి' సాంగ్, నితిన్ రాబిన్ హుడ్ సినిమాలోని 'అదిదా సర్‌ప్రైజ్' పాటలపై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి.  ఈ పాటల్లోని హుక్ స్టెప్పులపై నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. మహిళలను కించపరిచే విధంగా డాన్సులు ఉన్నాయి. ఇలాంటి స్టెప్స్ ఉంటే ఫ్యామిలీతో కలిసి సినిమాలకు వెళ్ళేది ఎలా అని మండిపడ్డారు. 

cinema-news | latest-news | film-industry

Also Read: అత్యంత దయనీయంగా శ్రీతేజ్‌ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు