Shekar Master: నీ భార్యతో ఇలానే చేయిస్తావా? శేఖర్ మాస్టర్ పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

'రాబిన్‌హుడ్' సినిమాలోని 'అది ధ సర్‌ప్రైజు' పాటలో శేఖర్ మాస్టర్ హుక్ స్టెప్పు పై దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. కేతికా శర్మతో స్కర్ట్ లేపించే బోల్డ్ స్టెప్పుపై ఫైర్ అవుతున్నారు. ఆయన భార్యతో ఇలాంటి స్టెప్పులు వేయించగలరా అంటూ మండిపడుతున్నారు.

New Update
Ketika Sharma Item Song

Ketika Sharma Item Song

Shekar Master: టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇటీవలే బాలయ్య  'దబిడి దిబిడి'  పాటలో ఊర్వశీ బ్యాక్ పై కొట్టే స్టెప్పును విపరీతంగా ట్రోల్ చేయగా.. మరోసారి వల్గర్ హుక్ స్టెప్‌తో.. నెటిజన్లతో ఛీ అనిపించుకుంటున్నారు శేఖర్ మాస్టర్. 

Also Read:అత్యంత దయనీయంగా శ్రీతేజ్‌ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి

నీ భార్యతో ఇలానే చేయిస్తావా?

 అయితే  నితిన్- శ్రీలీల కాంబోలో వస్తున్న 'రాబిన్‌హుడ్' సినిమాలో  'అది ధ సర్‌ప్రైజు' ఐటమ్ నెంబర్ తో ఫుల్ హైప్ క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. అలాగే ఈ పాట కోసం హాట్ బ్యూటీ  కేతికా శర్మను కూడా ఎంచుకున్నారు. కానీ అది కాస్త రివర్స్ అయ్యింది. ఈ పాటలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కేతికా శర్మతో స్కర్ట్ లేపించే బోల్డ్ స్టెప్పుపై ఫైర్ అవుతున్నారు. ఇలాంటి స్టెప్స్ ఉంటే ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్ళేది ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఆయన భార్యతో ఇలాంటి స్టెప్పులు వేయించగలరా అంటూ మండిపడుతున్నారు. శేఖర్ మాస్టర్ వల్ల సాంగ్, సినిమా రెండింటికీ ఎఫెక్ట్ పడుతుందని ట్రోల్ చేస్తున్నారు. 

Also Read:అత్యంత దయనీయంగా శ్రీతేజ్‌ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి

Advertisment
తాజా కథనాలు