Mega Star:  మీరొక అద్భుతం..మీ ప్రయాణం ఓ అడ్వెంచర్..చిరంజీవి

సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమి మీదకు చేరుకోవడంపై మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. వ్యోమగాములకు స్వాగతం పలుకుతూ పోస్ట్ పెట్టారు. మీ  ప్రయాణం ఒక థ్రిల్లర్‌ అడ్వెంచర్‌ మూవీని తలపిస్తోందని.. ఇదొక గొప్ప సాహసమని చిరు రాసారు.

New Update
chiru

Mega Star

సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లతో పాటూ మరో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ఈరోజు భూమి మీదకు సేఫ్ గా చేరారు. ప్రస్తుతం వారందరూ హ్యూస్టన్ లోని స్సేస్ సెంటర్ లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. తొమ్మది నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వ్యోమగాములు తిరిగి రావడంపై ప్రపంచం మొత్తం ఆనందం వ్యక్తం చేస్తోంది. వారికి స్వాగతం చెబుతూ పోస్ట్ లు పెడుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా సునీతా విలియమ్స్ కు వెల్ కమ్ చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు. వ్యోమగాములకు భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరారు. 

Also Read :  సినిమా అవకాశాల పేరుతో గాలం... వ్యభిచార రొంపిలోకి దింపి...

మీకు సాటి ఎవరూ లేరు..

ఈరోజు ఆస్ట్రోనాట్స్ భూమి మీదకు చేరుకోవడం ఒక చారిత్రాత్మక ఘట్టమని చిరంజీవి అన్నారు. 8 రోజుల్లో తిరిగిరావాలని వెళ్లి 286 రోజుల తర్వాత భూమికి చేరుకున్నారు. ఆశ్చర్యకరమైన రీతిలో 4577 సార్లు భూమి చుట్టూ తిరిగారు. సునీతా మీరు గొప్ప ధైర్యవంతులు..మీకు ఎవరూ సాటి రారు అంటూ సోషల్ మీడియా పోస్ట్ లో రాసుకొచ్చారు చిరంజీవి. మీ  ప్రయాణం ఒక థ్రిల్లర్‌ అడ్వెంచర్‌ మూవీని తలపిస్తోందని.. ఇదొక గొప్ప సాహసం.. నిజమైన బ్లాక్‌బస్టర్‌ అని రాసారు.  

Also Read :  భర్తను చంపి.. సిమెంట్ డ్రమ్‌లో కలిపేసి: ప్రియుడికోసం నేవి అధికారి భార్య ఘోరం!

Also Read: NASA: క్రూ-9 సిబ్బందికి అభినందనలు..స్పేస్ ఎక్స్ పాత్ర అద్భుతం-నాసా

Also Read :  నేనొక మూర్ఖున్ని... కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

#Social Media #post #today-latest-news-in-telugu #mega star chiranjeevi
Advertisment
Advertisment
తాజా కథనాలు