War 2 Song: ‘వార్2’ నుంచి రొమాంటిక్ సాంగ్.. హృతిక్-కియార్ కెమిస్ట్రీ చూశారా?

వార్ 2 మూవీ నుంచి మరో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘‘ఊపిరి ఊయలగా’’ అనే రొమాంటిక్ సాంగ్ తాజాగా విడుదలైంది. ఈ సాంగ్‌లో హృతిక్, కియారా మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. పాటలోని లోకేషన్స్ చాలా అందంగా, ఆకట్టుకునేలా ఉన్నాయి.

New Update
Oopiri Ooyalaga Song  WAR 2

Oopiri Ooyalaga Song | WAR 2

బాలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ‘వార్ 2’. ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్.. నువ్వా నేనా అన్నట్లుగా తలపడనున్నారు. YRF స్పై యూనివర్స్‌లో.. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన చిత్రాలలో అత్యంత ఖరీదైన సినిమాగా ఇది నిలుస్తుందని పలువురు భావిస్తున్నారు. దాదాపు రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం. ఇందులో బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. 

Also Read: బడా మోసం.. హీరో ‘పవర్‌స్టార్’ను అరెస్టు చేసిన పోలీసులు

దర్శకుడు అయాన్ ముఖర్జీల తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. 2023 అక్టోబర్‌లో ప్రారంభం అయిన ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎక్కువగా ముంబైలో ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారు. అలాగే స్పెయిన్, అబుదాబి, ఇటలీలో కొన్ని షెడ్యూల్స్ చేశారు. కాగా ఈ సినిమాను డాల్బీ అట్మాస్ సౌండ్‌తో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఊరమాస్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇందులో హృతిక్ రోషన్ - మేజర్ కబీర్ ధలీవాల్ పాత్రలో.. జూనియర్ ఎన్.టి.ఆర్ - వీరేంద్ర రఘునాథ్ పాత్రలో కనిపించనున్నారు. 

Also Read: ‘కింగ్డమ్’ మూవీ హిట్టా? ఫట్టా?.. అదిరిపోయిన రివ్యూ

ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మరో అదిరిపోయే అప్డేట్ అందించారు. తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేశారు. War 2 సినిమా నుంచి ‘‘ఊపిరి ఊయలగా’’ (Oopiri Ooyalaga) అనే రొమాంటిక్ సాంగ్ తాజాగా విడుదలైంది. ఈ సాంగ్ సినిమాపై మరింత అంచనాలను పెంచింది.

‘‘ఊపిరి ఊయలగా’’ సాంగ్‌లో హృతిక్ రోషన్, అందాల తార కియారా అద్వానీ నటించారు. ఈ పాటలో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. పాటలోని లోకేషన్స్ చాలా అందంగా, ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాటకు చంద్రబోస్ మనసుకు హత్తుకునే సాహిత్యం అందించాగా.. శ్రావ్యమైన గాత్రాలతో శశ్వంత్ సింగ్, నిఖితా గాంధీ ఆలపించారు. 

Advertisment
తాజా కథనాలు