/rtv/media/media_files/2025/04/16/mgmV2LVt05zk8eZLCljH.jpg)
vaizag police shock to devi sri prasad
Devi Sri Prasad: లైవ్ ఇండియా టూర్ లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ పలు చోట్ల లైవ్ షో కాన్సర్ట్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో దేవి ఈనెల 19న విశాఖపట్టణంలోని విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ లో మ్యూజికల్ కాన్సర్ట్‌కు ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు. మరో మూడు రోజుల్లో ఈవెంట్ ఉండగా.. దేవికి వైజాగ్ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. లైవ్ షో కాన్సర్ట్ నిర్వహించేందుకు పర్మిషన్స్ రద్దు చేశారు. భద్రత కారణాల దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని తెలిపారు.
Also Read: Dil Raju: బిగ్ అనౌన్స్మెంట్.. AI స్టూడియోకి దిల్ రాజు శ్రీకారం!
బాలుడు చనిపోవడంతో.. !
అయితే ఇటీవలే స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్‌లో ఓ బాలుడు మునిగి చనిపోయాడు. ఈ ఘటన నేపథ్యంలోనే కాన్సర్ట్ నిర్వహించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈవెంట్ కి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. షో టికెట్లు కూడా భారీ మొత్తంలో అమ్ముడయ్యాయి. ఈ పరిస్థితుల్లో షో పర్మిషన్స్ రద్దవడంతో దేవి శ్రీ ప్రసాద్ తో పాటు నిర్వాహకులు, టికెట్ కొనుగోలు చేసినవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ కాన్సర్ట్‌కు అనుమతి నిరాకరించిన సీపీ బాగ్చి. 19న విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్‌లో మ్యూజికల్ నైట్. ఇప్పటికే ఆన్లైన్లో భారీగా టికెట్ల విక్రయం. భద్రతా కారణాలతో అనుమతి ఇవ్వని సీపీ.#AndhraPradesh #Visakhapatnam#Vizag #VizagNews #TeluguNews pic.twitter.com/5LRNnraIHS
— Vizag News Man (@VizagNewsman) April 16, 2025
ఇప్పటికే దేవి UK, యూరప్, ఆస్ట్రేలియా, US, వంటి దేశాల్లో తన మ్యూజికల్ కాన్సెర్ట్స్ నిర్వహించారు. ఇప్పుడు ఇండియాలో కూడా ప్రదర్శనలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో లైవ్ కాన్సెర్ట్ చేశారు.
telugu-news | latest-news | cinema-news | devi-sri-prasad
Also Read: Sunny Deol: చర్చిలో రక్తపాతం.. స్టార్ హీరోపై క్రైస్తవ సంఘాలు ఆగ్రహం.. సినిమా బ్యాన్!?