'మెకానిక్ రాకీ' ట్రైలర్.. కామెడీ, లవ్, యాక్షన్ తో అదరగొట్టిన విశ్వక్ సేన్

విశ్వక్ సేన్ హీరోగా న‌టిస్తున్న ‘మెకానిక్ రాకీ’ మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. కామెడీ, లవ్, యాక్షన్ సీన్స్ తో ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. సునీల్ ఇందులో విలన్ రోల్ చేశారు. ఆయనకు విశ్వక్ కు మధ్య వచ్చే సీన్స్ హైలైట్ గా నిలిచాయి.

New Update

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కెరీర్ పరంగా ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒక్కో సినిమా ఒక్కో జోనర్ కావడం విశేషం. ఈ ఏడాది ఇప్పటికే గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన ఈ హీరో ఇప్పుడు 'మెకానిక్‌ రాకీ' మూవీతో రాబోతున్నాడు. రవితేజ ముళ్ళపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీ అక్టోబర్ 31 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read : 'అన్ స్టాపబుల్ సీజన్ 4' షూటింగ్.. సీఎంతో బాలయ్య పిక్ వైరల్

రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్ స్పీడ్ పెంచిన మూవీ టీమ్ తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. కామెడీ, లవ్, యాక్షన్ సీన్స్ తో ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ట్రైలర్ విషయానికొస్తే..' నువ్వు ఏం భ‌య‌ప‌డ‌కు నాన్న. నేను ఎలాగైనా సివిల్ ఇంజ‌నీర్‌ను అవుతా' అని విశ్వ‌క్ డైలాగ్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. కంప్యూట‌ర్స్ చ‌దివి సివిల్ ఇంజినీర్ అవుతా అంటూ సీనియర్ హీరో న‌రేశ్ అంటారు. 

Also Read : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రభాస్.. ఆ రోజే స్పెషల్ సర్ప్రైజ్

ఆ తర్వాత కార్ మెకానిక్ వర్క్ నేర్చుకునేందుకు విశ్వక్ పడే పాట్లను ఫన్నీగా చూపించారు. అందులో హీరోయిన్స్ కి డ్రైవింగ్ నేర్పిస్తూ వాళ్ళను లవ్ లో పడేసే సీన్లు చూపించారు. ఆ తర్వాత ట్రైలర్ ఒక్కసారిగా సీరియస్ మోడ్ లో సాగింది. సునీల్ ఇందులో విలన్ రోల్ చేశారు. ఆయనకు విశ్వక్ కు మధ్య వచ్చే సీన్స్ హైలైట్ గా నిలిచాయి. 

Also Read : పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్.. అకిరా వచ్చేస్తున్నాడు

విశ్వక్ మాస్ డైలాగ్స్ అదుర్స్..

రిపేరుకు వస్తే ఫ్రీగా సర్వీసింగ్ చేస్తా, సౌండ్ ఎక్కువస్తే బోర్ చేస్తా, అంతకుమించి మొండికేస్తే ఒక్కొక్కడి ఇంజన్ తీసి గూష్మండంలో బిగిస్తా' అని విశ్వక్ సేన్.. సునీల్ కు ఇచ్చే వార్నింగ్ సీన్ ట్రైలర్ మొత్తానికే హైలైట్ అని చెప్పొచ్చు. మొత్తంగా 'మెకానిక్ రాకీ' ట్రైలర్ ను బట్టి చూస్తే ఇదొక పక్కా మాస్ కమర్షియల్ బొమ్మ అని అర్థమవుతుంది.

Also Read : 'పుష్ప2' స్పెషల్ సాంగ్.. రంగంలోకి ప్రభాస్ హీరోయిన్

#mechanic-rocky #vishwak-sen
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe