'అన్ స్టాపబుల్ సీజన్ 4' షూటింగ్.. సీఎంతో బాలయ్య పిక్ వైరల్

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న‘అన్‌స్టాపబుల్‌’ సీజన్ 4 కు సంబంధించిన తొలి ఎపిసోడ్‌ షూట్‌ జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా కనిపించనున్నారు. తాజాగా ఆయన షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
unstpble4

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించే అద్భుతమైన టాక్‌షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొదటి మూడు సీజన్లు అద్భుతమైన విజయం సాధించిన ఈ షో నాలుగో సీజన్‌కు సిద్ధమవుతోంది. ఇటీవల దసరా రోజున సీజన్ 4 ను లాంచ్ చేశారు. 

Also Read : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రభాస్.. ఆ రోజే స్పెషల్ సర్ప్రైజ్

సీఎంతో ఫస్ట్ ఎపిసోడ్..

త్వ‌ర‌లోనే ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా అందుకు సంబంధించిన షూటింగ్ జ‌రుగుతోంది. మొద‌టి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం నారాచంద్ర‌బాబు నాయుడు వ‌చ్చారు. ఈ ఎపిసోడ్‌ షూట్‌ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. ఈ మేరకు చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందించి అన్‌స్టాపబుల్‌ సెట్‌లోకి బాలయ్య ఆహ్వానించారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

Also Read : పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్.. అకిరా వచ్చేస్తున్నాడు

ముఖ్యంగా బాలయ్యతో చంద్రబాబు ఉన్న పిక్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.  చంద్రబాబు ఈ టాక్‌ షోలో పాల్గొనడం ఇది తొలిసారి కాదు. ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 3’లోనూ ఆయన పాల్గొన్నారు. తన వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు.

Also Read : 'పుష్ప2' స్పెషల్ సాంగ్.. రంగంలోకి ప్రభాస్ హీరోయిన్

 ఆద్యంతం సరదాగా సాగిన ఆ ఎపిసోడ్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాగా అన్ స్టాపబుల్ తొలి ఎపిసోడ్ ఆహాలో అక్టోబ‌ర్ 25న రాత్రి 8.30 గంట‌ల‌కు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. చంద్రబాబు తర్వాత సీజన్ 4 లో అల్లు అర్జున్‌, దుల్కర్‌ సల్మాన్, కోలీవుడ్ హీరో సూర్య సైతం సందడి చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read : హీరో కిచ్చా సుదీప్ ఇంట విషాదం.. పవన్ కళ్యాణ్ ట్వీట్

Advertisment
Advertisment
తాజా కథనాలు