Kannappa: మంచు విష్ణు కన్నప్ప నుంచి మరో కొత్త పోస్టర్.. పరమశివుడి అవతారంలో బాలీవుడ్ హీరో!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' నుంచి మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో పరమశివుడి పాత్రలో నటిస్తున్న బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్ లుక్ పోస్టర్ ను పంచుకున్నారు. ఈ పాత్రలో నటించడంపై అక్షయ్ కుమార్ ఆనందం వ్యక్తంచేశారు

New Update

Kannappa:  మంచు విష్ణు లీడ్ రోల్లో తెరకెక్కుతున్నలేటెస్ట్ మైథలాజికల్ డ్రామా 'కన్నప్ప'. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కి చెందిన స్టార్ కాస్ట్ అంతా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించడం మూవీ పై అంచనాలను భారీ పెంచుతోంది. సినిమాలోని పాత్రలను ఒకదాని తర్వాత ఒకటి పరిచయం చేస్తూ క్యూరియాసిటీనీ పెంచుతున్నారు. ఇప్పటికే పలు పాత్రలు లుక్ పోస్టర్లు విడుదల చేయగా.. తాజాగా మరో పాత్రను రివీల్ చేశారు. 

Also Read:Ajanta Ellora International Film Festival: 'శాంతి నికేతన్' చిత్రానికి గోల్డెన్ కైలాస్ అవార్డు!

పరమశివుడిగా అక్షయ్ కుమార్.. 

'కన్నప్ప' లో పరమశివుడి పాత్ర పోషిస్తున్న అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. శివుడి గెటప్ లో అక్షయ్ కుమార్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మహాదేవ్ పాత్రలో నటించడం పై అక్షయ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. స్టార్ హీరోయిన్ కాజల్ పార్వతీదేవిగా కనిపించనుంది. ప్రభాస్, శరత్ కుమార్, నయనతార, ముఖేష్ రిషీ, మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శివరాజ్ కుమార్, సంపత్ తదితర స్టార్స్ పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇంత మంది స్టార్ కాస్ట్ తో పాటు మంచు విష్ణు కొడుకు, కూతుళ్లు కూడా సినిమాలో  కనిపించబోతున్నారు. 

అత్యున్నత సాంకేతిక పరిజ్ఞాన, భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్నఈ చిత్రాన్ని Ava ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మిస్తున్నారు.  కన్నప్ప ఏప్రిల్ 25 న దేశవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా అత్యధిక భాగాన్ని న్యూజిలాండ్ లో చిత్రీకరించినట్లు మేకర్స్ తెలిపారు. 

Also Read:Actor Rangaraju: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు రంగరాజు మృతి

Advertisment
తాజా కథనాలు