/rtv/media/media_files/2025/04/23/0J9kIEgXnuU1yKwCkpxn.jpg)
vijay devarakonda on Pahalgam attack
Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ అటాక్ దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పహల్గామ్ ప్రకృతి అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులను మంగళవారం మధ్యాహ్నం ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు. ఈ ఘటనలో 20 మంది పర్యాటకులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా తీవ్రగాలయ్యాయి. ఈ ఉగ్రదాడిని దేశమంతా తీవ్రంగా ఖండిస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులు మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలో హీరో విజయ దేవరకొండ ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పర్యాటకులపై ఉగ్రవాదదాడి తన మనసును కలచివేసిందని పోస్ట్ పెట్టారు. అలాగే పహల్గామ్ ప్రాంతంతో తనకున్న ఓ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
I celebrated my birthday 2 years ago in Pahalgam, amidst shooting a film, amidst laughter, amidst my local Kashmiri friends who took the greatest care of us..
— Vijay Deverakonda (@TheDeverakonda) April 23, 2025
What happened yesterday is heartbreaking and infuriating - calling yourself a Force and shooting tourists is the most…
నా బర్త్ డే, షూటింగ్ అక్కడే
''రెండేళ్ల క్రితం నా బర్త్ డేను అక్కడే సెలెబ్రేట్ చేసుకున్నాను. ఓ మూవీ షూటింగ్ లో భాగంగా అక్కడికి వెళ్లిన నేను.. అందమైన ప్రకృతి, అక్కడి ప్రజల స్వచ్ఛమైన నవ్వుల మధ్య బర్త్ డే జరుపుకున్నాను. స్థానిక కశ్మీరీ స్నేహితులు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. అలాంటిది నిన్న ఆ ప్రాంతంలో జరిగినది విని నా గుండె ముక్కలైంది'' అని పోస్ట్ పెట్టారు.
అలాగే ''సైనికులుగా వచ్చి కాల్పులు జరపడం సిగ్గుచేటు.. ఒక పిరికి చర్య. ఇలాంటి పిరికి వాళ్ళను త్వరలోనే అంతమొందించాలని ఆశిస్తున్నాము. బాధితులకు, వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని'' తెలిపారు విజయ్.
latest-news | cinema-news | vijaya-devarakonda
Also Read: AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!