Vijay- Rashmika: మళ్ళీ హింట్ ఇచ్చిన విజయ్- రష్మిక.. ముంబై రెస్టారెంట్ వీడియో వైరల్

విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న డేటింగ్ వార్త మరోసారి నెట్టింట హాట్ టాపిక్ మారింది. ఇటీవలే వీరిద్దరూ ముంబైలోని ఓ రెస్టారెంట్ లో కలిసి కనిపించారు. దీంతో విజయ్ - రష్మిక ప్రేమలో ఉన్నారనే రూమర్లు మరింత బలపడ్డాయి.

New Update

Vijay- Rashmika: విజయ దేవరకొండ- రష్మిక రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై  వీరిద్దరూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయనప్పట్టికీ.. తరచూ ఇద్దరు ఒకే ప్రదేశాల నుంచి ఫొటోలు షేర్ చేయడం, వెకేషన్స్ కి వెళ్లడం, విజయ్ ఇంట్లోనే రష్మిక పండగలు జరుపుకోవడం ఈ పుకార్లకు దారితీశాయి.

Also Read: Court Ott Release: 'కోర్ట్' డ్రామాకు ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి

లంచ్ డేట్.. 

ఈ క్రమంలో మరోసారి వీరిద్దరూ కలిసి కనిపించడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే మార్చి 30న ముంబైలోని ఓ రెస్టారెంట్ రష్మిక- విజయ్ కలిసి కనిపించారు. అయితే  'సికందర్' గ్రాండ్ రిలీజ్ తర్వాత రష్మిక విజయ్ తో లంచ్ డేట్ కి వెళ్లినట్లుగా తెలుస్తోంది. విజయ్ తెల్లటి పూల చొక్కాలో ఆఫ్-వైట్ ప్యాంటు ధరించగా, రష్మిక బ్రౌన్ టీ షర్ట్ - ట్రౌజర్ ధరించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో వైరల్ గా మారాయి. దీంతో విజయ్ - రష్మిక ప్రేమలో ఉన్నారనే రూమర్లకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా  ఓ ఈవెంట్ లో రష్మిక.. తనకు ఇష్టమైన పర్సన్ ఎవరో అందరికీ తెలుసు అంటూ చెప్పడం.. వీరిద్దరూ  రిలేషన్ లో ఉన్నారని చెప్పకనే చెప్పినట్లుగా ఉందని నెటిజన్లు అనుకుంటున్నారు. 

latest-news | telugu-news | cinema-news

Also Read: Janhvi Kapoor: సూట్ విప్పి.. ర్యాంప్ పై అదరగొట్టిన జాన్వీ.. నడుస్తుంటే మామూలుగా లేదుగా! వీడియో వైరల్

Advertisment
తాజా కథనాలు