Court Ott Release: 'కోర్ట్' డ్రామాకు ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

నాని నిర్మించిన సూపర్ హిట్ కోర్ట్ డ్రామా 'కోర్ట్: State Vs A Nobody' చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్11 నుంచి నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

New Update

Court Ott: హీరో నాని నిర్మాతగా ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి, నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ కోర్టు డ్రామా  'కోర్ట్: State Vs A Nobody'.  అతితక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.  రూ. 11 కోట్లతో నిర్మించగా.. విడుదలైన 3 వారాల్లోనే రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. కంటెంట్ ఉంటే చాలు.. ఎలాంటి సినిమానైనా  ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమాతో మరోసారి రుజువైంది. 

Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి

కోర్ట్ ఓటీటీ రిలీజ్.. 

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. త్వరలోనే  'కోర్ట్' ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.   తెలుగుతో పాటు  తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం  భాషల్లో అందుబాటులోకి రానుంది. పోక్సో చట్టం అంటే ఏంటి.? దానిని కొందరు ఎలా మిస్ యూజ్ చేస్తున్నారు..?  చట్టం దుర్వినియోగం కారణంగా  అమాయకుల జీవితాలు ఎలా బలవుతున్నాయి? అనే మంచి మెసేజ్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 

డెబ్యూ డైరెక్టర్ రామ్ జగదీశ్ దర్శకత్వం వచించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, హర్ష వర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, రాజశేఖర్ అనింగి కీలక పాత్రలు పోషించారు. సినిమాలో ప్రతి ఒక్కరు తమ నటనతో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా మంగపతిగా శివాజీ నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది. 

cinema-news | latest-news | court-movie | court ott release 

Also Read:Janhvi Kapoor: సూట్ విప్పి.. ర్యాంప్ పై అదరగొట్టిన జాన్వీ.. నడుస్తుంటే మామూలుగా లేదుగా! వీడియో వైరల్

Advertisment
తాజా కథనాలు