బాంబ్ పేల్చిన విజయ్ దేవరకొండ! ఆమెతో డేటింగ్ నిజమే..?

స్టార్ హీరో విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్నారంటూ వస్తున్న వార్తల పై స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు తప్పకుండా బయటపెడతానని క్లారిటీ ఇచ్చారు.

New Update
vijay

vijay Photograph: (vijay )

Vijay Deverakonda:  టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ సీక్రెట్ రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్వరలో ఆ అమ్మాయిని పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవకాండ ఈ డేటింగ్ రూమర్స్ పై స్పందించారు. 

సమయం రావాలి.. 

విజయ్ మాట్లాడుతూ.. నేను సిద్ధంగా ఉన్నప్పుడు ఆ విషయం గురించి మాట్లాడతాను. ప్రపంచం తెలుసుకోవాలని అనుకున్నప్పుడు తప్పకుండా ఆ విషయాన్ని బయటపెడతాను అని తెలిపారు. దానికంటూ ప్రత్యేక సమయం, సందర్భం, కారణం ఉండాలి. అలాంటి సంతోషకరమైన రోజు వచ్చినప్పుడు నా వ్యక్తిగత జీవితం గురించి అందరితో పంచుకుంటానని  క్లారిటీ ఇచ్చారు. అలాగే విజయ్ ప్రేమ గురించి మాట్లాడుతూ.. సృష్టిలో అపరిమితమైన ప్రేమ ఉందో , లేదో నాకు తెలియదు. ఒకవేళ ఉంటే.. దానితోపాటు భాద కూడా ఉంటుంది. మీరు ఎవరినైనా అమితంగా  ప్రేమిస్తే భాదను కూడా మోయాల్సి ఉంటుందని తెలిపారు. 

ఇది కూడా చూడండి: అమిత్‌ షాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి: మంత్రి పొన్నం

రష్మికతో రిలేషన్ షిప్ అంటూ వార్తలు.. 

అయితే విజయ్, రష్మిక రిలేషన్ లో ఉన్నారంటూ తరచూ వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. అంతేకాదు విజయ్ వెకేషన్ కి వెళ్లిన ప్లేస్ నుంచే రష్మిక కూడా ఫొటోలు షేర్ చేయడం, విజయ్ ఇంట్లోనే పండగలు జరుపుకోవడం లాంటివి ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఇక ఇటీవలే ఓ ఈవెంట్ లో రష్మిక.. తనకు ఇష్టమైన పర్సన్ ఎవరో అందరికీ తెలుసు అంటూ చెప్పడం.. వీరిద్దరూ  రిలేషన్ లో ఉన్నారని చెప్పకనే చెప్పినట్లుగా ఉందని నెటిజన్లు అనుకుంటున్నారు. 

ఇది కూడా చూడండి:  ఫైనల్లీ.. క్లీంకార ఫొటో షేర్ చేసిన ఉపాసన.. తాత చేతుల్లో ఎంత ముద్దుగా ఉందో..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు