టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య రిలేషన్ గురించి చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తమ వ్యక్తిగత జీవితంపై ఇప్పటివరకు ఇద్దరూ ఓపెన్‌గా స్పందించకపోయినప్పటికీ, వారిని చూసిన వారంతా వీళ్ళ మధ్య ఏదో ఉన్నట్లు భావిస్తున్నారు. ఇటీవల, రష్మిక 'పుష్ప2' ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ.. తాను సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పరోక్షంగా హింట్ ఇచ్చింది.అదే సమయంలో, విజయ్ దేవరకొండ కూడా రష్మికతో ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు. సరైన సమయం వచ్చినప్పుడు తన జీవితంలోని అన్ని విషయాలను పంచుకుంటానని తెలిపారు. ప్రేమ అనేది అపారమైనదా కాదా అనే విషయంపై మాత్రం తాను సందిగ్ధంలో ఉన్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ జంట మరోసారి మీడియా కంట పడ్డారు. #VijayDeverakonda and #RashmikaMandanna spotted together at #Hyderabad Airport on their return from a holiday! 😍#VD12 #Pushpa2TheRule #thegirlfriend #Pushpa3TheRampage pic.twitter.com/3auZVz0wX9 — Pakka Telugu Media (@pakkatelugunewz) December 24, 2024 మళ్ళీ దొరికిపోయారుగా.. సోమవారం రాత్రి విజయ్, రష్మిక ఇద్దరూ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. రష్మిక ముందుగా అక్కడికి చేరుకొని ఫ్యాన్స్ తో ఫోటోలు దిగింది. అనంతరం కొద్ది సమయానికే విజయ్ అక్కడికి రాగా, అతను తన అభిమానులతో సరదాగా ఫోటోలు తీసుకున్నాడు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఇద్దరూ ఈ పండుగలను కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి విదేశాలకు వెళ్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చిన ఈ ఇద్దరు.. మళ్ళీ కొత్త సంవత్సరానికల్లా తిరిగి ఇండియా వచ్చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న VD 12 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. రష్మిక ఇటీవల 'పుష్ప 2'తో భారీ హిట్ అందుకుంది. ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్, సికిందర్ తో పాటూ పలు సినిమాలు చేస్తోంది.