Dharmendra : ప్రముఖ నటుడు కన్నుమూత

బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూశారు. కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తాజాగా కన్నుమూశారు. అతని మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ధర్మేంద్ర నివాసానికి చేరుకుంటున్నారు.

New Update
Veteran Actor Dharmendra Passes Away at 89

Veteran Actor Dharmendra Passes Away at 89

Dharmendra : బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూశారు. కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తాజాగా కన్నుమూశారు. అతని మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ధర్మేంద్ర నివాసానికి చేరుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర పది రోజుల క్రితం ముంబైలోని క్యాండి ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత ఆసుపత్రి నుంచి ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు. చివరికి ప్రస్తుతం ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూశారు. 

Also Read: ఎన్నికల కమిషన్ చేపట్టిన SIR అంటే ఏంటీ? రాజకీయ పార్టీల అభ్యంతరాలు దేనికి?

ధర్మేంద్ర ఎవరు ? 

1935, డిసెంబర్ 8న ధర్మేంద్ర పంజాబ్‌లో జన్మించారు. ఈయనకు ఇద్దరు భార్యలు. ఒకరు ప్రకాశ్‌ కౌర్, మరొకరు హేమా మాలిని. ధర్మేంద్ర-ప్రకాశ్‌ కౌర్‌కు సన్నీ డియోల్, బాబీ డియోల్‌ సంతానం. ఇక ధర్మేంద్ర-హేమామాలినికి ఇషా డియోల్, ఆహానా డియోల్ సంతానం. అత్యంత ప్రజాదారణ పొందిన షోలేలో ధర్మేంద్ర వీరూ పాత్రలో నటించారు. ఈ సినిమాతో ఆయనకు బాగా పాపులారిటీ వచ్చింది. 300లకు పైగా సినిమాల్లో నటించిన ధర్మేంద్ర.. యాక్షన్‌ కింగ్‌గా, బాలీవుడ్‌ హీ మ్యాన్‌గా గుర్తింపు పొందారు. 

Also Read: మొబైల్‌లో గేమ్స్‌కు బానిసైన బాలిక.. తల్లిదండ్రులు ఫోన్‌ కొనివ్వలేదని సూ*సైడ్

అలీబాబా ఔర్‌ 40 చోర్, దోస్త్‌, డ్రీమ్‌ గర్ల్‌, గాయల్, సన్నీ, లోఫర్‌, మేరా, నామ్‌జోకర్‌ తదితర చిత్రాల్లో ఆయన నటించారు. 1977లో ఆయనకు ఫిల్మ్‌ఫేర్  జీవిత సాఫల్య పురస్కారం వరించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం 2012లో పద్మభూషణ్‌తో సత్కరించింది.2004లో రాజస్థాన్‌లోని బికనీర్‌ లోక్‌సభ స్థానం నుంచి కూడా ఆయన ఎంపీగా గెలిచారు. ధర్మేంద్ర మృతి పట్లు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు