/rtv/media/media_files/2025/11/23/nagpur-teen-dies-by-suicide-2025-11-23-21-30-38.jpg)
Upset Over Parents Not buying Phone, Nagpur Teen Dies By Suicide
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు ఫోన్ కొనివ్వలేదని కారణంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. చంకపూర్‌లోని మురికివాడ ప్రాంతంలో ఓ 13 ఏళ్ల బాలిక తన కుటుంబంతో కలిసి ఉంటోంది. 8వ తరగతి చదువుతున్న ఆ బాలిక మొబైల్ ఫోన్‌లో గేమ్స్ ఎక్కువగా ఆడి వాటికి బానిస అయిపోయింది.
Also Read: SIR ఎఫెక్ట్.. స్వదేశానికి పారిపోతున్న బంగ్లాదేశీయులు
దీంతో తనకు సొంతంగా మొబైల్ ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను అడిగింది. కానీ వాళ్లు నిరాకరించారు. దీంతో ఆ బాలిక తీవ్ర మనస్తాపం చెందింది. ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. ఆమె తల్లి, సోదరి ఇంటికి వచ్చాక సీలింగ్‌కు వేలాడుతున్న ఆమెను చూసి కంగుతిన్నారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆ బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Also read: ఎంతపని చేశావమ్మా.. అమెరికా వీసా రావడం లేదని యువతి ఆత్మహత్య..
Follow Us