/rtv/media/media_files/2025/03/03/KRUU0bR03JPCW08ADtBA.jpg)
VV VINAYAK
ప్రముఖ దర్శకులు వి వి వినాయక్ #vinayak ఆరోగ్యం పై కొన్ని మాధ్యమాలలో వస్తున్న వార్తలు అవాస్తవం. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా వున్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా వాస్తవాలు తెలుసుకొని ప్రచురించాలి అని మనవి. pic.twitter.com/oLJhA4ywU1
— Journalist Chandrakanth (@Nagachandrakant) March 3, 2025
స్టార్ డైరెక్టర్ గా..
డైరెక్టర్ వీవీ వినాయక్ ఒకప్పుడు టాలీవుడ్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా పేరు తెచ్చుకున్నారు. ఆది, చెన్నకేశవ రెడ్డి, దిల్, లక్ష్మి, ఠాగూర్, అదుర్స్, కృష్ణ, నాయక్, అల్లుడు శీను వంటి సూపర్ హిట్స్ తో స్టార్ డైరెక్టర్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోల నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ వంటి యంగ్ హీరోలతోనూ పనిచేశారు. అయితే గత కొన్నేళ్లుగా టాలీవుడ్ కి దూరంగా ఉన్న ఆయన.. చివరిగా 2017లో మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెం. 150 తీశారు. ఆ తర్వాత తెలుగులో ఆయన సినిమాలు తీయలేదు. 2023 లో ప్రభాస్ 'ఛత్రపతి' సినిమాను హిందీలో రీమేక్ చేశారు. తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం హిందీలో అట్టర్ ప్లాప్ అయ్యింది.
Also Read: Kiran Abbavaraam: 'దిల్రుబా' స్టోరీ చెప్పు.. అదిరిపోయే బైక్ పట్టు.. కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్!