/rtv/media/media_files/2025/06/03/QRgCr0RX5otfhod8LIl8.jpg)
Television actor Vibhu Raghave passed away
Vibhu Raghave: ప్రముఖ టెలివిజన్ నటుడు విభూ రాఘవే తుది శ్వాస విడిచారు. కొద్దిరోజులుగా కోలన్ క్యాన్సర్ తో పోరాడుతున్న విభూ ముంబైలోని నానావతి హాస్పిటల్ చికిత్స పొందుతూ జూన్ 2న కన్నుమూశారు. ఈ విషయాన్ని విభూ స్నేహితులు, కో యాక్టర్స్ మలిక్, సౌమ్యా టండన్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. విభూ చివరి సంస్కారాలు జూన్ 3న జోగేశ్వరీ వెస్ట్‌లో నిర్వహించనున్నారు. 33 ఏళ్ళ వయసులోనే విభూ అకాల మరణంపై ఆయన అభిమానులు, సహనటులు తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు అతడి మృతి పట్ల మరణం పట్ల తోటి నటులు రేమన్ కాకర్, నవీనా బోల్, ద్రష్టి ధామి,రితు చౌదరి సేత్ శ్రద్ధాంజలి ఘటించారు.
Also Read: Chiranjeevi: కమెడియన్ అలీకి మెగాస్టార్ సర్ప్రైజ్ గిఫ్ట్.. భార్య జుబేదా వీడియో వైరల్
Vibhu Raghave, popular actor of ‘Nisha Aur Uske Cousins,’ fought cancer bravely for 3 years before passing away on June 2.The TV industry says goodbye to a talented actor.#Vibhuraghave #passedaway #RIP #TV #Actor #Cancer #tellymasala pic.twitter.com/Tz6Lj5SaHS
— Telly Masala (@tellymasala) June 3, 2025
Also Read: Telusu Kada: ఇద్దరు హీరోయిన్లతో సిద్ధూ వీడియో కాల్ వైరల్.. అసలు మ్యాటర్ తెలిసిపోయింది!
2022లో స్టేజ్ 4 కాలన్ క్యాన్సర్
2022లో విభూ రాఘవేకు స్టేజ్ 4 కోలన్ క్యాన్సర్ నిర్దారణ అయ్యింది. అప్పటినుంచి తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉన్నారు. విభూ హిందీలో ‘నిషా ఔర్ ఉస్కే కజిన్స్’ అనే సీరియల్‌తో ఎంతో గుర్తింపు పొందారు. విభూ చివరి వరకు ధైర్యంగా, ఆశతో పోరాడారు. ఆయన చూపిన సహనం , జీవితాన్ని ఎదుర్కొన్న విధానం ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది.
Also Read: Rajendra Prasad: నేను అలాగే మాట్లాడుతా.. అది మీ ఖర్మ .. రాజేంద్రప్రసాద్ రియాక్షన్ ఇదే!