Telusu Kada: ఇద్దరు హీరోయిన్లతో సిద్ధూ వీడియో కాల్ వైరల్.. అసలు మ్యాటర్ తెలిసిపోయింది!

సిద్దూ జొన్నలగడ్డ , శ్రీనిధి, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న 'తెలుసు' కదా మూవీ విడుదల తేదీని వినూత్నంగా ప్రకటించారు. ఇద్దరు హీరోయిన్లతో సిద్దూ వీడియో కాల్ మాట్లాడుతూ ఫన్నీగా అనౌన్స్ చేశారు. అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు.

New Update

Telusu Kada: ఇటీవలే 'జాక్' సినిమతో అలరించిన స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ మరో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. లేడీ డైరెక్టర్ నీరజకోన దర్శకత్వంలో 'తెలుసు కదా' చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ బిజీగా కొనసాగుతుంది. ఇందులో సిద్దూ జోడీగా రాశీ ఖన్నా, కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి కథనాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న సిద్దూ ఫ్యాన్స్ కి మేకర్స్ అదిరిపోయే న్యూస్ చెప్పారు.

రిలీజ్ డేట్

తాజాగా మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ ప్రకటన కూడా సిద్దూ తన స్టైల్లో బిన్నంగా చేశారు. ఇద్దరు హీరోయిన్లతో సరదాగా వీడియో కాల్ మాట్లాడుతూ విడుదల తేదీని అనౌన్స్ చేశారు. అక్టోబర్ 17 ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు