సంధ్య థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్..ఈ విషయాలు తెలుగు సినిమా ఇండస్ట్రీని పెద్ద కుదుపుకు గురిచేశాయి. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో సమస్యను పరిష్కరించేందుకు సినిమా పెద్దలు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా నేడు సీఎం రేవంత్ రెడ్డిని కలవాలని డిసైడ్ అయ్యారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో పెద్దలు రేవంత్‌తో సమావేశం కానున్నారు. ఇందులో దిల్ రాజు, చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, పలువురు నిర్మాతలు, దర్శకులు.. ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ హాజరు కానున్నారు.
అల్లు అర్జున్, తెలంగాన ప్రభుత్వం మధ్య సయోధ్య..
సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సినీ పరిశ్రమ సమస్యలు, తాజా పరిణామాలపై చర్చిస్తామని దిల్ రాజు చెప్పారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం, అల్లు అర్జున్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. సమస్యను వీలైనంత త్వరగా సద్దుమణిగేలా సీఎంతో చర్చిస్తామని, తమనుంచి అన్ని విధాల సహాకారం అందించేందుకు సిద్దంగా ఉన్నామని దిల్ రాజు తెలిపారు. అలాగే బాధిత కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తామని ఇప్పటికే ప్రకటించగా.. శ్రేతేజ్ కోలుకోవడం ఊరటకలిగించే అంశమని చెప్పారు. అలాగే సంధ్య థియేటర్ ఘటన తర్వాత రాష్ట్రంలో బెన్ ఫిట్ షోలు, టికెట్ల పెంపు నిర్ణయం ఉండదని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేవంత్ రెడ్డితో సినీ పెద్దల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు ఆసుపత్రిలో ఉన్న శ్రీతేజ్, బాధితుల కుటుంబాన్ని అల్లు అరవింద్, దిల్ రాజు పరామర్శించారు. బాధిత కుటుంబానికి అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, నిర్మాత సంస్థ మైత్రిమూవీమేకర్స్ తరఫున రెండు కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.
Also Read: Cinema: ఇద్దరు మేనేజర్లను తొలగించిన చిరంజీవి.. అసలేం జరుగుతోంది?