Mass Jathara : రవితేజ మాస్ జాతర... నీ అమ్మని అక్కని.. బాబోయ్ ఇవేం లిరిక్స్ రా బాబు

తాజాగా మేకర్స్ మూవీ ప్రమోషన్ లో భాగంగా మాస్ సాంగ్ రిలీజ్ చేశారు. ఓలే.. ఓలే అనే పాటను విడుదల చేయగా.. ఈ పాట లిరిక్స్ మరి దారుణంగా ఉన్నాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.  

New Update
raviteja

రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా సినిమా 'మాస్ జాతర'. ఇది రవితేజ 75వ చిత్రం.  'సామజవరగమన' వంటి హిట్ సినిమాకు రచయితగా పనిచేసిన  భాను భోగవరపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.  ఈ చిత్రంలో నవీన్ చంద్ర కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.  ఈ సినిమా కథ తెలంగాణ ప్రాంతం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. రవితేజ ఇందులో 'లక్ష్మణ్ భేరి' అనే పాత్రలో కనిపించనున్నారు.సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వినాయక చవితి పండుగ సందర్భంగా ఆగస్టు 27వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. 

నీ అమ్మని అక్కని అంటూ

తాజాగా మేకర్స్ మూవీ ప్రమోషన్ లో భాగంగా తాజాగా మాస్ సాంగ్ రిలీజ్ చేశారు. ఓలే.. ఓలే అనే పాటను విడుదల చేయగా.. ఈ పాట లిరిక్స్ మరి దారుణంగా ఉన్నాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.  నీ అమ్మని అక్కని అంటూ రచయిత భాస్కర్ యాదంవ్ రెచ్చిపోయి మరి రాశారని కామెంట్స్ పెడుతున్నారు. ఆ పదాలు వినడానికి ఎబ్బెట్టుగా ఉన్నాయని అంటున్నారు. మాస్ ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి లిరిక్స్ రాశారని కొంతమంది అభిమానులు చెబుతున్నారు. రోహిణి సోర్రత్‌తో కలిసి భీమ్స్ సిసిరోలియో ఈ జానపద గీతాన్ని ఆలపించారు. 

 ఈ పాటపై  రవితేజ తన ఎక్స్ వేదికగా స్పందిస్తూ, "నాకు ఫోక్ బీట్స్‌కు డ్యాన్స్ చేయడం ఎప్పుడూ ఇష్టమే. నేను ఎంజాయ్ చేసినట్లే మీరూ ఈ పాటకు వైబ్ అవుతారని ఆశిస్తున్నా" అని ట్వీట్ చేశారు. చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా, "రవితేజ, శ్రీలీల తెరపై అదరగొట్టారు. ఈ పాట ఫుల్ వైబ్‌తో ఉంది" అని పోస్ట్ చేసింది. ఈ పాటలో రవితేజ, శ్రీలీల పోటీపడి మరి డాన్స్ చేశారు. కాగా 'ధమాకా' సినిమా తర్వాత రవితేజ, శ్రీలీల కలిసి నటిస్తున్న రెండో చిత్రం ఇది. వీరిద్దరి కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో భారీ మాస్, యాక్షన్, కామెడీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని సమాచారం. 'మాస్ జాతర' పేరుకు తగ్గట్టుగా థియేటర్లలో రవితేజ అభిమానుల కోసం ఒక పండుగలా ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది.

 కిషోర్ తిరుమల దర్శకత్వంలో

మాస్ జాతర తర్వాత, రవితేజ..   కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ఈ ప్రాజెక్టును సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. దీనికి అనార్కలి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను సంక్రాంతి 2026కి విడుదల అయ్యే అవకాశం ఉంది. 

Advertisment
తాజా కథనాలు