/rtv/media/media_files/2025/08/05/coolie-latest-update-2025-08-05-21-27-22.jpg)
Coolie Latest Update
Coolie Latest Update: టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్‌తో(Rajinikanth) కలసి తెరకెక్కించిన భారీ ప్రాజెక్ట్ ‘కూలీ’తో(Coolie Movie) ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుండటంతో, ప్రమోషన్స్ శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో, లోకేశ్ ఇచ్చిన ఇంటర్వ్యూలలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం 2 ఏళ్ల ప్లాన్! (Coolie Interval)
లోకేశ్ మాట్లాడుతూ - "ఇది నా మొదటి సినిమా రజనీ సార్‌తో... అందుకే ఈ సినిమాకు ఇంటర్వెల్ సీన్ చాలా స్పెషల్ గా ఉండాలని రెండేళ్ల పాటు ప్లాన్ చేశాను. సినిమా విడుదలైన తర్వాత ఆ సీన్‌కి ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో అనేదే నాకు చాలా ఆసక్తిగా ఉంది" అని చెప్పారు. దీనితో, ‘కూలీ’లో ఇంటర్వెల్ సీన్ పై భారీ హైప్ పెరిగింది.
#Coolie - Powerful Intervel #Rajinikanth𓃵#CoolieUnleashedpic.twitter.com/qimkGJerZq
— IndiaGlitz Telugu™ (@igtelugu) August 5, 2025
Also Read:‘కూలీ’ యూఎస్ ప్రీ-సేల్స్ ఊచకోత!! ఇదిరా అరాచకం అంటే..
షూటింగ్ రోజులు మర్చిపోలేను: లోకేశ్
‘కూలీ’ షూటింగ్ సమయంలో జరిగిన మధురమైన జ్ఞాపకాల గురించి కూడా లోకేశ్ పంచుకున్నారు. షూటింగ్ చివరి రోజు తాను భావోద్వేగానికి లోనయ్యానని తెలిపారు. ఒక సీన్ లో శృతి హాసన్ నటనను రజనీకి చూపించినప్పుడు, ఆయన ఏమీ మాట్లాడలేదని. కానీ మరుసటి రోజు స్వీట్లు తెప్పించి శృతికి ఇచ్చారని, అది తనకు స్పెషల్ మెమరీగా మిగిలిపోయిందన్నారు. అలాగే నటుడు సౌబిన్ నటన కూడా రజనీ సార్‌ను ఆకట్టుకుందన్నారు.
ఖైదీ 2 అప్‌డేట్..
‘కూలీ’ తర్వాత ‘ఖైదీ 2’పై దృష్టిపెడతానని లోకేశ్ తెలిపారు. ప్రస్తుతం ఈ కథలో 35 పేజీలు మాత్రమే రాసినట్టు తెలిపారు. ఈ సీక్వెల్‌లో విక్రమ్, లియో క్యారెక్టర్లను కూడా చూపించనున్నట్టు పేర్కొన్నారు. ఇది లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో కీలకం కాబోతుందట. ఇక, విక్రమ్ సినిమాలోని ఏజెంట్ టీనా క్యారెక్టర్‌పై ఓ స్పెషల్ వెబ్‌సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు, కానీ దాన్ని తాను డైరెక్ట్ చేయడం లేదని స్పష్టం చేశారు.
Also Read:'కూలీ' లో నేనే హీరో.. నా పాత్ర ఎలా ఉంటుందంటే? : నాగార్జున
పరాశక్తి లో విలన్ గా లోకేష్ ఛాన్స్ మిస్..
శివకార్తికేయన్ హీరోగా వస్తున్న ‘పరాశక్తి’ సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకురాలు సుధా కొంగర రెండు సార్లు లోకేశ్‌ను కలిసారని తెలిపారు. స్క్రిప్ట్ బాగా నచ్చినా, ‘కూలీ’ పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆ ఆఫర్‌ను వదిలేశానని అన్నారు. అయితే త్వరలో అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తానని తెలియజేశారు.
ఇక రజినీకాంత్ కూలీ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అమెరికా ప్రీ బుకింగ్ సేల్స్ లో దుమ్ము దులుపుతోంది. తమిళ బాషాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అదే రోజుల ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్ 2 కూడా విడుదలవుతోంది. మరి ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ హిట్ ని సొంతం చేసుకుంటాయో చూడాలి.