Celebrities Apology: మనం మాట్లాడేటప్పుడు కొన్ని సందర్భాలలో మనం ఒకటి చెప్తే అది ఇతరులకు ఇంకోలాగా అర్థం అవుతుంది, ఇలాంటి ఘటనలు తరచూ చాలా మందికి చాలా సందర్భాలలో జరుగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు వెంటనే ఆ తప్పును సరిదిద్దటానికి మనం వివరణ ఇస్తూ ఉంటాం. అయితే ఇలాంటివి సెలబ్రేటిస్ విషయాలలో జరిగితే మాత్రం అది ఫుల్ వైరల్ అయిపోయి హాట్ టాపిక్ గా మారుతోంది. ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి తెలిసో , తెలియకో ఏదోకటి మాట్లాడడం తర్వాత తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అలాంటి ఘటనలు మన తెలుగు ఇండస్ట్రీలో జరిగినవి కొన్ని ఇప్పుడు చూద్దాం..
Also Read: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!
దున్నపోతు.. బాహుబలిలో ప్రభాస్ అన్న లెక్క - సావిత్రక్క
బిగ్‌బాస్ ఫేమ్ సావిత్రక్క అలియాస్ శివజ్యోతి ఈ పేరు కి పెద్దగా పరిచయం అవసరం లేదు బిగ్‌బాస్ తో సావిత్రక్క కి మంచి క్రేజ్ వచ్చింది. అయితే సావిత్రక్క ఇటీవల ఒక వీడియోలో మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. ప్రభాస్ ఫాన్స్ అయితే ఆమెపై ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. ఇంతకీ ఆ వీడియోలో అక్క ఏమందంటే ఒక పెద్ద దున్నపోతు దగ్గర నిలబడి "దేశంలోనే అత్యంత ఎత్తయిన, పొడవైన దున్నపోతు ఇది, బాహుబలిలో ప్రభాస్ అన్న లెక్కనున్నావ్ దిట్టంగా" అంటూ నోరు జారింది. ఈ మాటలు కొంతమందికి మాములుగా అనిపించినా.. ప్రభాస్ ఫ్యాన్స్ కొంతమంది హర్ట్ అయ్యారు.
Also Read: ఈశా ఫౌండేషన్‌కు బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం
రామలక్ష్మణులు" ఫిక్షనల్ కేరక్టర్స్ - శ్రీముఖి
అలాగే శ్రీముఖి ఒక సినిమా ఫంక్షన్‌లో "రామలక్ష్మణులు" ఫిక్షనల్ కేరక్టర్స్ అన్న మాటలు అయితే ఫుల్ ట్రోల్ అయ్యాయి చాలా మంది ఆమెను వ్యతిరేకించారు, దాంతో శ్రీముఖి తన తప్పు తెలుసుకొని వెంటనే క్షమాపణ చెప్పింది.
Also Read: HYD: పుప్పాలగూడలో అగ్నిప్రమాదం..పాపతో సహా ముగ్గురు మృతి
తెల్లకల్లు, మటన్ ముక్కా - దిల్ రాజు
ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి కూడా ఇలాంటి సంఘటనే ఎదురయ్యింది. తెలంగాణ సంస్కృతిని కించపరిచేలా తెల్లకల్లు, మటన్ ముక్కా అంటూ వ్యాఖ్యలు చేసి తర్వాత క్షమాపణలు చెప్పాడు.
సింగర్ మధుప్రియ అయితే ఏకంగా కాలేశ్వరం గుడిలో ప్రైవేటు సాంగ్ షూట్ చేసింది, కానీ ఈమె విషయంలో శిక్ష ఆ గుడి ఈవోకి పడింది. అంత జరిగినా సింగర్ మధుప్రియ మాత్రం నోరు మెదపలేదు. అలాగే, మంగ్లీ కూడా కాళహస్తి గుడిలో ప్రైవేట్ సాంగ్ షూట్ చేసి విమర్శలకు గురైంది.
శ్రీకాంత్ అయ్యంగార్ ఈయన ఒక సినిమా ఫంక్షన్లో చేసిన వ్యాఖ్యలు అయితే విమర్శలే కాదు అసహ్యాన్ని కూడా కలిగించాయి. అయితే శ్రీకాంత్ అయ్యంగార్ మాత్రం తనపై వచ్చిన విమర్శలకు క్షమాపణ చెప్పకుండా “మీరు నన్నేమి చేయలేరు” అన్నట్టుగా స్పందించాడు.
ఇటీవల, ఒక దర్శకుడు సినిమా ఫంక్షన్లో "మన్మథుడు" హీరోయిన్ అన్షు పై ఏకంగా సైజుల మీద కామెంట్స్ చేసాడు. అయితే, వెంటనే ఆ దర్శకుడు తప్పు తెలుసుకొని క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేసాడు.
ఇలాంటి సంఘటనలు ఇండస్ట్రీలో అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. నోరుజారడం తప్పు తెలుసుకొని క్షమాపణ కోరడం. ఏది ఏమైనప్పటికీ సెలబ్రిటీ హోదాలో మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనుక అలోచించి మాట్లాడడం కరెక్ట్ అన్ని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Celebrities Apology: నోరు జారి.. క్షమాపణలు చెప్పిన సెలెబ్రెటీలు వీళ్ళే..!
సినీ ఫీల్డ్ లో కొంత మంది సెలబ్రిటీలు తెలిసో, తెలియకో నోరు జారడం తర్వాత తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అలాంటి ఘటనలు మన తెలుగు ఇండస్ట్రీలో జరిగినవి కొన్ని ఇప్పుడు చూద్దాం..
Celebrities Apology
Celebrities Apology: మనం మాట్లాడేటప్పుడు కొన్ని సందర్భాలలో మనం ఒకటి చెప్తే అది ఇతరులకు ఇంకోలాగా అర్థం అవుతుంది, ఇలాంటి ఘటనలు తరచూ చాలా మందికి చాలా సందర్భాలలో జరుగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు వెంటనే ఆ తప్పును సరిదిద్దటానికి మనం వివరణ ఇస్తూ ఉంటాం. అయితే ఇలాంటివి సెలబ్రేటిస్ విషయాలలో జరిగితే మాత్రం అది ఫుల్ వైరల్ అయిపోయి హాట్ టాపిక్ గా మారుతోంది. ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి తెలిసో , తెలియకో ఏదోకటి మాట్లాడడం తర్వాత తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అలాంటి ఘటనలు మన తెలుగు ఇండస్ట్రీలో జరిగినవి కొన్ని ఇప్పుడు చూద్దాం..
Also Read: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!
దున్నపోతు.. బాహుబలిలో ప్రభాస్ అన్న లెక్క - సావిత్రక్క
బిగ్‌బాస్ ఫేమ్ సావిత్రక్క అలియాస్ శివజ్యోతి ఈ పేరు కి పెద్దగా పరిచయం అవసరం లేదు బిగ్‌బాస్ తో సావిత్రక్క కి మంచి క్రేజ్ వచ్చింది. అయితే సావిత్రక్క ఇటీవల ఒక వీడియోలో మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. ప్రభాస్ ఫాన్స్ అయితే ఆమెపై ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. ఇంతకీ ఆ వీడియోలో అక్క ఏమందంటే ఒక పెద్ద దున్నపోతు దగ్గర నిలబడి "దేశంలోనే అత్యంత ఎత్తయిన, పొడవైన దున్నపోతు ఇది, బాహుబలిలో ప్రభాస్ అన్న లెక్కనున్నావ్ దిట్టంగా" అంటూ నోరు జారింది. ఈ మాటలు కొంతమందికి మాములుగా అనిపించినా.. ప్రభాస్ ఫ్యాన్స్ కొంతమంది హర్ట్ అయ్యారు.
Also Read: ఈశా ఫౌండేషన్‌కు బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం
రామలక్ష్మణులు" ఫిక్షనల్ కేరక్టర్స్ - శ్రీముఖి
అలాగే శ్రీముఖి ఒక సినిమా ఫంక్షన్‌లో "రామలక్ష్మణులు" ఫిక్షనల్ కేరక్టర్స్ అన్న మాటలు అయితే ఫుల్ ట్రోల్ అయ్యాయి చాలా మంది ఆమెను వ్యతిరేకించారు, దాంతో శ్రీముఖి తన తప్పు తెలుసుకొని వెంటనే క్షమాపణ చెప్పింది.
Also Read: HYD: పుప్పాలగూడలో అగ్నిప్రమాదం..పాపతో సహా ముగ్గురు మృతి
తెల్లకల్లు, మటన్ ముక్కా - దిల్ రాజు
ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి కూడా ఇలాంటి సంఘటనే ఎదురయ్యింది. తెలంగాణ సంస్కృతిని కించపరిచేలా తెల్లకల్లు, మటన్ ముక్కా అంటూ వ్యాఖ్యలు చేసి తర్వాత క్షమాపణలు చెప్పాడు.
సింగర్ మధుప్రియ అయితే ఏకంగా కాలేశ్వరం గుడిలో ప్రైవేటు సాంగ్ షూట్ చేసింది, కానీ ఈమె విషయంలో శిక్ష ఆ గుడి ఈవోకి పడింది. అంత జరిగినా సింగర్ మధుప్రియ మాత్రం నోరు మెదపలేదు. అలాగే, మంగ్లీ కూడా కాళహస్తి గుడిలో ప్రైవేట్ సాంగ్ షూట్ చేసి విమర్శలకు గురైంది.
శ్రీకాంత్ అయ్యంగార్ ఈయన ఒక సినిమా ఫంక్షన్లో చేసిన వ్యాఖ్యలు అయితే విమర్శలే కాదు అసహ్యాన్ని కూడా కలిగించాయి. అయితే శ్రీకాంత్ అయ్యంగార్ మాత్రం తనపై వచ్చిన విమర్శలకు క్షమాపణ చెప్పకుండా “మీరు నన్నేమి చేయలేరు” అన్నట్టుగా స్పందించాడు.
Also Read: Champions Trophy: బ్యాడ్ లక్ ఆఫ్ఘాన్..సెమీస్ కు ఆసీస్