OTT: ది ఫ్యామిలీ మ్యాన్‌ 3 ఓటీటీలోకి.. స్ట్రీమింగ్‌ అయ్యేది అప్పుడే!

యాక్షన్ థ్రిల్లర్‌ సిరీస్‌ ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌ ఓటీటీలో అత్యధిక వ్యూస్ సంపాదించుకుంది. ఇప్పటికే రెండు సీజన్లు రాగా.. వీటికి మంచి స్పందన లభించింది. అయితే మూడో సీజన్‌ ఈ ఏడాది నవంబర్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా రిలీజ్ కానున్నట్లు మనోజ్ తెలిపారు.

New Update
The Family Man

The Family Man Photograph: (The Family Man)

ది ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌సిరీస్ ఓటీటీలో రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ మూడో సీజన్‌ కోసం సినీప్రియులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మనోజ్‌ బాజ్‌పాయ్‌ ఈ సిరీస్‌లో కీలకపాత్ర పోషించాడు. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ అన్ని రికార్డును బద్దలు కొట్టింది. అయితే ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైనా మనోజ్ బాజ్‌పాయ్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందనే విషయాన్ని తెలిపారు. 

ఇది కూడా చూడండి: Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!

నవంబర్‌లో ఓటీటీలోకి..

పాతాళ్‌లోక్‌-2లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న జైదీప్‌ అహ్లావత్‌ ది ఫ్యామిలీ మ్యాన్‌ 3లో కనిపించనున్నారు. రెండేళ్ల క్రితమే ఆయన ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఆయన ఉన్నట్లు తెలిసినప్పటికీ రెండేళ్లక్రితమే ఇందులో జాయిన్‌ అయినట్లు ఎవరికీ తెలియదు. ఆయన పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆ పాత్ర వివరాలు మాత్రం ఇప్పుడే వెల్లడించలేం. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా నవంబర్ నుంచి ది ఫ్యామిలీ మ్యాన్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుందని తెలిపారు. 

ఇది కూడా చూడండి: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

ఈ స్పై థ్రిల్లర్ సిరీస్‌లో మరో అగ్ర నటుడు భాగం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. ది ఫ్యామిలీ మ్యాన్‌ రెండు సీజన్లు కూడా ఓటీటీలో అత్యధిక వ్యూస్ సంపాదించుకుంది. ఇప్పటివరకూ రెండు సీజన్లు పూర్తి చేసుకున్న యాక్షన్ థ్రిల్లర్‌ సిరీస్‌ ముచ్చటగా మూడోసారి అలరించడానికి సిద్ధమైంది. 

ఇది కూడా చూడండి:  Israel-Netanyahu: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్‌ కు నెతన్యాహు హెచ్చరికలు!

పార్ట్‌ 3లో జైదీప్‌ అహ్లావత్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు సమాచారం. ‘సీజన్‌2’లో సమంత ప్రతినాయకురాలిగా నటించారు. తమిళ టైగర్స్‌ తరపున పోరాటం చేసే మహిళగా కనిపించారు.

ఇది కూడా చూడండి: CSK VS RCB: చెన్నై మీద ఆర్సీబీ సూపర్ విక్టరీ..పాయింట్ల పట్టికలో టాప్

The Family Man | web-series | amazon-prime-video | cinema news in telugu | latest-telugu-news | today-news-in-telugu | telugu-film-news

Advertisment
తాజా కథనాలు