/rtv/media/media_files/2025/02/12/8x9yV37dcMoF2k5lVV3m.jpg)
divya pillai
Divya Pillai: నాగచైతన్య- సాయి పల్లవి(Naga Chaitanya- Sai Pallavi) జంటగా నటించిన లేటెస్ట్ లవ్ స్టోరీ 'తండేల్'(Thandel) ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. విడుదలైన తొలిరోజు నుంచే సూపర్ హిట్ రెస్పాన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోంది. అయితే ఈ సినిమాలో సాయి పల్లవితో పాటు ఆమె అక్క పాత్ర కూడా బాగా హైలైట్ అయ్యింది. వారిద్దరి మధ్య సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. దీంతో సినీ ప్రియులంతా అక్క పాత్రలో నటించిన ఆ ముద్దుగుమ్మ ఎవరా అని తెగ సెర్చ్ చేస్తున్నారు.
ఎవరీ దివ్య పిళ్ళై
సాయి పల్లవి అక్క పాత్రలో నటించిన ఈ మలయాళ కుట్టి పేరు దివ్య పిళ్లై. తెలుగు ప్రేక్షకులకు దివ్య పెద్దగా పరిచయంలేనప్పటికీ.. 'మంగళవారం' సినిమాలో జమిందారీ భార్య రాజేశ్వరీ దేవి పాత్ర అంటే మాత్రం అందరికీ గుర్తొస్తుంది. క్లైమాక్స్‌లో దివ్య పాత్ర ఊహించని ట్విస్ట్ ఇస్తుంది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఫుల్ పాపులరైంది. అదే క్రేజ్ తో 'తండేల్' లో కూడా ఛాన్స్ కొట్టేసింది.
'మంగళవారం' సినిమాతో పాపులర్
దివ్య ఎక్కువగా మలయాళ సినిమాల్లో నటించింది. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, మమ్ముట్టి వంటి స్టార్ హీరోల సినిమాల్లో యాక్ట్ చేసింది. 2015లో 'అయల్ నజనల్ల' అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు తమిళ్, మలయాళం సినిమాల్లో మెయిన్ లీడ్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది. తెలుగులో కూడా హీరోయిన్ గా 'తగ్గేదేలే' అనే సినిమాలో నటించింది. కానీ, ఆ సినిమా ఆడకపోవడంతో పెద్దగా ఎవరికీ ఈమె గురించి తెలియలేదు. ఆ తర్వాత 'మంగళవారం' సినిమాతో బాగా పాపులర్ అయ్యింది.
Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే
వెబ్ సీరీస్ లు కూడా
సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లలో కూడా నటిస్తుంది దివ్య. ది విలేజ్, మాస్టర్ పీస్ అనే సీరీస్ లు చేసింది. సినిమాలు సీరీస్ లే కాకుండా టీవీ షోలలోనూ సందడి చేస్తుంటుంది. మలయాళంలో పలు టీవీ షోలకు జడ్జ్ గా వ్యవహరించింది.
Also Read: Trump: ట్రంప్ మరో తలతిక్క నిర్ణయం...ప్రపంచ దేశాలకు విరుద్ధంగా పేపర్ వద్దు..ప్లాస్టికే ముద్దంటన్న పెద్దన్న!