/rtv/media/media_files/2025/04/22/Cx0KstOxww2n70ZOHziJ.jpg)
viral video_ student removed hero vijay hand from shoulder
Thalapathy Vijay: సౌత్ సూపర్ స్టార్ దళపతి విజయ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ విజయ్ కి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. అతడు ఎక్కడైనా కనిపిస్తే ఒక్క ఫొటో అయినా తీసుకోవాలని తహతహలాడుతారు అభిమానులు. అలాంటిది విజయ్ తో ఫొటో తీసుకునేటప్పుడు ఓ విద్యార్థిని చేసిన పని అందరినీ షాక్ కి గురిచేసింది. ఫొటో తీస్తున్న సమయంలో విజయ్ విద్యార్థిని భుజం పై చేయగా.. ఆమె చేతిని తీసేసింది.
Also Read: Iswarya Menon: నడుము అందాలు చూపిస్తున్న ఐశ్వర్య.. హాట్ లుక్స్‌లో పిచ్చెక్కిస్తుందిగా!
9k half baked peoples liked this 🤡
— 𝕵𝖔𝖍𝖓 𝕵𝕽™ (@vetrimaran_of) April 21, 2025
Original Video is here .
எங்கள உங்களால ஒன்னும் செய்ய முடியாது ப்ரோ.#தமிழகவெற்றிக்கழகம் pic.twitter.com/x2wIg66GkA
అసలేం జరిగిందంటే
అయితే 'తమిళ వెట్రి కజగం' పార్టీ చెన్నైలో నిర్వహించిన వార్షిక అవార్డుల ప్రదానోత్సవానికి హీరో విజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 10, 12వ తరగతుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఈ కార్యక్రమంలో సత్కరించారు. ఈ క్రమంలో విజయ్ స్టేజ్ పై ఇద్దరు విద్యార్థినులకు బహుమతులు అందజేసి వారితో కలిసి ఫొటో దిగారు. అయితే ఫొటో దిగుతున్న సమయంలో విజయ్ విద్యార్థి భుజంపై చేయి వేయగా.. ఆమె అతడి చేయిని తీసేసింది. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విజయ్ అభిమానులు తీవ్ర కలత చెందారు. కొందరు ఆవిద్యార్థిని తీరుపై మండిపడ్డారు కూడా.. కానీ, ఆ తర్వాత వచ్చిన ఫుల్ వీడియోతో అసలు విషయం తెలిసింది. విజయ్ చేయి పట్టుకొని ఫొటో దిగడం కోసం భుజం పై నుంచి తీసేసింది ఆ విద్యార్థిని. ఏడాది క్రితం జరిగిన ఈ సంఘటన.. ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
latest-news | cinema-news | thalapathy-vijay
Also Read: Viral News: ఫోన్ తీసుకుందని.. టీచర్‌ను చెప్పుతో కొట్టి, ల*జే అంటూ దాడిచేసిన విద్యార్థిని: (వీడియో)