/rtv/media/media_files/2025/02/06/SLwfse82YEfJUW0Od2iu.jpg)
telugu film chamber of commerce important decision
తెలుగు సినిమా పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రతి ఏడాది ఫిబ్రవరి 6న అవార్డుల వేడుక నిర్వహించాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు తెలుగు సినిమా దినోత్సవం కార్యక్రమంలో దీనిని ప్రకటించింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: ఉదయం లేచిన తర్వాత నీరు ఎప్పుడు తాగాలి?
ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటులు, రైటర్స్ సహా మరికొంతమంది పాల్గొన్నారు. మురళీ మోహన్, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, రైటర్ పరిచూరి గోపాలకృష్ణ, దర్శకుల సంఘం అధక్షులు వీర శంకర్, సెక్రటరీ ప్రసన్న కుమార్, రైటర్ జర్నలిస్ట్ రెంటాల జయదేవ్ సహా మరికొంతమంది ప్రముఖులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: విటమిన్ డి కోసం నెలలో ఎన్నిసార్లు సూర్యరశ్మి అవసరం?
కీలక నిర్ణయం
ఇందులో భాగంగానే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC).. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఛాంబర్ తరఫున ఉత్తమ ప్రదర్శన కనబరిచిన సినిమాలు, నటీనటులకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. తెలుగు సినిమా పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఏడాది ఫిబ్రవరి 6న ఈ అవార్డుల ప్రదానోత్సవ వేడుక నిర్వహించనుంది.
Telugu Film Chamber Strikes Back! Announces Own Awards Amid "Gaddar Awards" Controversy
— TeluguScribe Now (@TeluguScribeNow) February 6, 2025
After CM Revanth Reddy’s "Gaddar Awards" proposal faced backlash from many in the industry, the Telugu Film Chamber has decided to launch its own annual awards! Starting this year, the awards… pic.twitter.com/inFOWGigas
Also Read : TDPలో మంగ్లి చిచ్చు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ పై దుమ్మెత్తి పోస్తున్న కేడర్!
అందువల్ల ప్రతి ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన ప్రతి నటుడి ఇంటిపై, అలాగే రాష్ట్రంలోని థియేటర్లపైనా జెండా ఎగురవేయాలని సూచించింది. ఈమేరకు ఈ జెండా రూపకల్పన బాధ్యతను సినీ రచయిత పరిచూరి గోపాలకృష్ణకు అప్పగించినట్లు ఫిల్మ్ ఛాంబర్ పేర్కొంది.
Also Read : తాడేపల్లి వైసీపీ ఆఫీస్ సమీపంలో అగ్ని ప్రమాదం
అనంతరం మురళీ మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుల కంటే సినిమా వాళ్లకే ఎక్కుగా ప్రజల్లో ఆదరణ ఉందని అన్నారు. సినీ నటులు ఎప్పుడూ ప్రేక్షకుల హృదయాల్లో ఉంటారని అన్నారు. ఫిబ్రవరి 6న తెలుగు సినిమా దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.