Matka : మూడు వారాలకే ఓటీటీలోకి 'మట్కా'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

వరుణ్ తేజ్ 'మట్కా' మూవీ ఇటీవలే థియేటర్స్ లో రిలీజై భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. డిసెంబరు 5 నుంచి అమెజాన్ ప్రైమ్‌ వీడియోలోకి 'మట్కా' స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్‌ అధికారికంగా అనౌన్స్ చేసింది.

New Update
matka (1)88

మెగా హీరోల్లో డిఫెరెంట్ మూవీస్ తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ తేజ్ ఇటీవల 'మట్కా' అనే సినిమాతో పేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ‘పలాస 1978’ మూవీ ఫేం కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై భారీ డిజాస్టర్ అయింది. 

Also Read: ఫడ్నవిస్‌కు బిగ్ షాక్.. మహారాష్ట్ర సీఎంగా కేంద్రమంత్రికి ఛాన్స్

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్..

నవంబర్ 14 న రిలీజ్ అయిన ఈ మూవీ నిర్మాతలకు రూ.60 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది. 'గాండీవ దారి అర్జున' తర్వాత వరుణ్ తేజ్ ఖాతాలో 'మట్కా' మరో డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. డిసెంబరు 5 నుంచి అమెజాన్ ప్రైమ్‌ వీడియోలోకి 'మట్కా' స్ట్రీమింగ్ కానుంది.

Also Read: బైక్‌ను తప్పించబోయి బస్సు బోల్తా... అక్కడికక్కడే 10 మందికి పైగా మృతి

 ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీ సంస్థ అధికారికంగా అనౌన్స్ చేసింది. థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే 'మట్కా' ఓటీటీలోకి రావడం గమనార్హం. థియేటర్స్ లో ఆడియన్స్ ను ఏమాత్రం మెప్పించలేకపోయిన ఈ సినిమా కనీసం ఓటీటీలోనైనా మంచి రెస్పాన్స్ అందుకుంటుందేమో చూడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు