/rtv/media/media_files/2025/09/23/mirai-vibe-song-2025-09-23-17-10-34.jpg)
Mirai Vibe Song
Mirai Vibe Song: తాజాగా విడుదలై భారీ విజయం అందుకున్న సినిమా ‘మిరాయ్’. యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja) హీరోగా నటించిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తోంది. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ మూవీ ఇప్పటివరకు దాదాపు రూ.130 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు దర్శకుడు కార్తిక్ గట్టమనేని, ఆయనే సినిమాటోగ్రాఫర్‌గా కూడా పని చేశారు. సినిమాలో మంచు మనోజ్ విలన్‌గా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు.
Also Read: 'ఓజీ' షో క్యాన్సిల్.. పవన్ ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్!
‘వైబ్ ఉందిలే’ పాట ఇకపై థియేటర్లలో (Mirai Vibe Udhuile Song in Theaters)
సినిమా విడుదలకు ముందు యూత్‌లో బాగా వైరల్ అయిన పాట "వైబ్ ఉందిలే", చివరికి థియేటర్లో లేకపోవడంతో అభిమానుల్లో కొంత నిరాశ చెందారు. మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి అందించిన ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్ అయినా, మేకర్స్ సినిమా కథను డిస్ట్రబ్ చేయకుండా ఉండేందుకే ఈ పాటను తొలగించామని అప్పట్లో పేర్కొన్నారు.
#VibeUndi song is now added in theatres worldwide
— PrideTelugu.com (@Pridetelugunews) September 23, 2025
Watch #Mirai on the big screens and groove to the vibe #BrahmandBlockbusterMirai In cinemas now
@tejasajja123@HeroManojpic.twitter.com/ArADJu2w8M
అయితే తాజాగా, సినిమా నాలుగో వారానికి ఎంటర్ అవుతుండడంతో ఈ పాటను మళ్లీ సినిమా లోకి జోడించారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో పాటు, ఇప్పుడు ఈ పాట థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. ఈ నిర్ణయం సినిమా కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సిందే.
ఇప్పటికే ‘మిరాయ్’ నార్త్ అమెరికాలో $2.5 మిలియన్ డాలర్ల వసూలు చేసి, తేజ సజ్జా కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. అయితే పవన్ కళ్యాణ్ నటించిన భారీ చిత్రం ‘ఓజీ’ ఈ గురువారం (సెప్టెంబర్ 25) విడుదల కాబోతుండటంతో, మిరాయ్ కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఓజీ బజ్‌లో కలెక్షన్లు తగ్గకుండా చూసేందుకు, ‘వైబ్ ఉందిలే’ పాటను మళ్లీ సినిమా లోకి జోడించడం ఒక స్ట్రాటజిక్ మూవ్ గా భావించవచ్చు.
ఈ చిత్రంలో శ్రియ శరణ్, జగపతి బాబు, గెటప్ శ్రీను, జయరామ్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
Also Read: 'OG' రిలీజ్ పోస్ట్ పోన్..? అసలు ఎందుకింత గందరగోళం..!
మొత్తానికి, మిరాయ్ టీం తీసుకున్న ఈ తాజా నిర్ణయం సినిమాకి ఎంత హెల్ప్ చేస్తుందో చూడాలి. కానీ ‘వైబ్ ఉందిలే’ పాట థియేటర్లలో మిస్ అయ్యాం అనుకున్నవారికి ఇది మంచి అవకాశం.