Mirai BTS Video: దుమ్ము దులుపుతున్న.. 'మిరాయ్' ట్రైన్ సీన్ బీటీఎస్ వీడియో.. గూస్ బంప్స్ పక్కా..!

తేజ సజ్జా హీరోగా నటించిన పాన్‌ ఇండియా మూవీ ‘మిరాయ్’ సెప్టెంబర్ 12న విడుదల కానుంది. అశోకుని కాలం నాటి గుప్త గ్రంథాల చుట్టూ కథ తిరుగుతుంది. ట్రైన్ యాక్షన్ సీన్ హైలైట్‌గా నిలవనుంది. ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ లభించగా 2D, 3D ఫార్మాట్లలో రిలీజ్ కానుంది.

New Update
Mirai BTS Video

Mirai BTS Video

Mirai BTS Video: యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja) హీరోగా నటించిన తాజా చిత్రం "మిరాయ్"(Mirai Movie) విడుదలకు రెడీ అయింది. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించగా, మంచు మనోజ్(Manchu Manoj) ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కింది.

ఈ నెల సెప్టెంబర్ 12న 'మిరాయ్' థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ తదితర భాషల్లో ఈ సినిమా 2D, 3D ఫార్మాట్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను మరింత వేగంగా నిర్వహిస్తున్నారు.

Also Read:ఫస్ట్ టైమ్.. కొడుకు ఫొటో షేర్ చేసిన వరుణ్ తేజ్.. ఎంత క్యూట్ గా ఉన్నాడో! పిక్స్ చూశారా

తాజాగా, ఈ సినిమా నుండి ఒక బీటీఎస్ వీడియో విడుదల చేశారు మేకర్స్. ఇందులో ట్రైన్ సీక్వెన్స్ గురించి వివరించారు. ఈ సన్నివేశం చిత్రంలో చాలా కీలకమైనది అని, కథను మలుపు తిప్పే ఘట్టంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. తేజ సజ్జా ఈ సన్నివేశంలో రిస్క్‌కి వెళ్లి నటించాడట. ఏకంగా ట్రైన్ మీద యాక్షన్ చేసేందుకు భయపడకుండా ముందుకు వచ్చాడని టీం తెలిపింది.

Also Read:"ఏటిగట్టు" ఆగిందా..? మెగా మేనల్లుడు క్లారిటీ..!

ఇక, ‘మిరాయ్’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే పెద్దల పర్యవేక్షణలో 12 ఏళ్లలోపు పిల్లలు కూడా ఈ సినిమాను చూడొచ్చు. విశేషం ఏంటంటే, కట్స్ లేకుండానే సినిమా సెన్సార్ పూర్తి కావడం! 

Also Read:'రాజా సాబ్' ప్రొడ్యూసర్ క్రేజీ అప్‌డేట్.. రెబల్‌ ఫ్యాన్స్‌ కి పండగే..!

కథలోకి వెళ్తే.. 

అశోకుడు కాలంలో ఉన్న తొమ్మిది గుప్త గ్రంథాలు ఈ కథకు కీలకం. ఇవి సాధారణ వ్యక్తిని దేవుడి స్థాయికి తీసుకెళ్లగల శక్తి కలిగినవి అని చెబుతారు. కానీ ఆ శక్తిని పొంది, ప్రపంచాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించే దుష్టశక్తులు గ్రంథాల కోసం ప్లాన్ చేస్తాయి.

అయితే ‘మిరాయ్’ అనే ఒక యువ యోధుడు ఈ గ్రంథాలను కాపాడే బాధ్యతను తీసుకుంటాడు. వాటిని రక్షిస్తూ, దుష్ట శక్తులకు ఎదురెళ్లి పోరాడతాడు. అదే ఈ సినిమాలో ఆసక్తికరంగా సాగే యాక్షన్, ఫాంటసీ డ్రామా.

Also Read: "మిరాయ్" సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే..?

ఈ సినిమా ద్వారా తేజ సజ్జా మళ్లీ తన టాలెంట్‌ని ప్రూవ్ చేయబోతున్నాడు. విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్, గ్రాఫిక్స్ అన్నీ హై స్టాండర్డ్స్‌తో ఉండనున్నట్లు ట్రైలర్, పోస్టర్లు చూస్తే తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు