Tanushree Dutta: బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా బిగ్ బాస్(Bigg Boss) పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తెలుగులో ‘అల్లరి పిడుగు’, ‘వీరభద్ర’ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. బాలీవుడ్‌లోనే తాను కొనసాగుతూ, అప్పుడప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటోంది.
తాజాగా మరోసారి తన వ్యాఖ్యలతో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
11 ఏళ్ల నుంచి వస్తున్న బిగ్ బాస్ ఆఫర్!
తనుశ్రీ దత్తా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని బిగ్ బాస్ రియాలిటీ షోపై ఆసక్తికర విషయాలు తెలిపింది. గత 11 సంవత్సరాలుగా బిగ్ బాస్ టీమ్ తనను సంప్రదిస్తుండగా, తాను ఒక్కసారి కూడా ఆ షోకు ఓకే చెప్పలేదని చెప్పింది.
“నాకు బిగ్ బాస్ షోంటే అసలు ఇష్టం ఉండదు. నాకు నా ప్రైవసీ చాలా ముఖ్యం. నేను నా ఫ్యామిలీతో కూడా ఎక్కువ సమయం గడపను. అలాంటప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో ఉంటానా? వాళ్లు నాకు ₹1.65 కోట్లు ఆఫర్ చేశారు. నా స్థాయి నటి ఒకరు అదే రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకుందని విన్నాను. అయినా నేను ‘నో’ చెప్పాను” అంటూ ఆమె తెలిపారు.
“అలాంటి షో నాకు అవసరం లేదు”
తనుశ్రీ మాట్లాడుతూ, “ఆ షోలో మగవాళ్లు, ఆడవాళ్లు ఒకే హాలులో పడుకుంటారు, గొడవ పడతారు. అది నా స్టైల్ కాదు. నేను ఒక మనిషితో ఒకే బెడ్‌పై పడుకునేంత చీప్ కాదు. నాకు నా స్వతంత్రత చాలా విలువైనది. నేను ప్రశాంతంగా ఉండే చోట పనిచేస్తే, ఆ షోలో ఇచ్చినదాని కన్నా ఎక్కువ సంపాదించగలను” అని చెప్పింది.
బిగ్ బాస్ షో పద్ధతులపై ఆమె తీవ్రంగా విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. చాలా మంది ఆఫర్ కోసం ఎదురు చూస్తుంటే, తనుశ్రీ మాత్రం ఈ విధంగా స్పందించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీగా షేర్ అవుతున్నాయి. కొందరు నెటిజన్లు “ఇంత డబ్బు ఆఫర్ చేసినా తిరస్కరించిందంటే, ఆమె నిజంగా తన విలువలు పాటిస్తోంది” అంటూ ప్రశంసిస్తున్నారు. మరికొందరు మాత్రం “ఇన్ని అవకాశాలు అందరికీ రావు, అలాంటి ఆఫర్‌ను రిజెక్ట్ చేయడం అహంకారం” అని కామెంట్లు చేస్తున్నారు. ఇది కాస్త వివాదాస్పద అంశంగా మారింది. తాను బిగ్ బాస్ షోలో పాల్గొనలేనని ఓపెన్‌గా చెప్పిన తారగా తనుశ్రీ మరోసారి హైలైట్ అవుతోంది.
తనుశ్రీ ప్రస్తుతం సినిమాలకన్నా సోషల్ మీడియాలో, ఇంటర్వ్యూలలో మాత్రమే కనిపిస్తుంది. గతంలో #MeToo ఉద్యమంలోనూ తన పేరు ప్రముఖంగా వినిపించింది. ఇప్పుడు బిగ్ బాస్ విషయంపై ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా మరోసారి ఆమెను న్యూస్‌లోకి తెచ్చాయి.
సాధారణంగా నటీమణులు బిగ్ బాస్ లాంటి భారీ ప్లాట్‌ఫారమ్‌కి వెళ్లడానికి ఆసక్తిగా ఉంటారు. కానీ తనుశ్రీ దత్తా మాత్రం తన , వ్యక్తిగత విలువల కోసం పెద్ద మొత్తంలో ఆఫర్ వచ్చినా కూడా 'నో' 'చెప్పిందట. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Tanushree Dutta: వాళ్ళతో పడుకోవాలి.. బిగ్ బాస్‌పై బాలయ్య హీరోయిన్ సంచలన కామెంట్స్!
సాధారణంగా నటీమణులు బిగ్ బాస్ లాంటి భారీ ప్లాట్‌ఫారమ్‌కి వెళ్లడానికి ఆసక్తిగా ఉంటారు. కానీ తనుశ్రీ దత్తా మాత్రం తన , వ్యక్తిగత విలువల కోసం పెద్ద మొత్తంలో ఆఫర్ వచ్చినా కూడా 'నో' 'చెప్పిందట. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Tanushree Dutta
Tanushree Dutta: బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా బిగ్ బాస్(Bigg Boss) పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తెలుగులో ‘అల్లరి పిడుగు’, ‘వీరభద్ర’ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. బాలీవుడ్‌లోనే తాను కొనసాగుతూ, అప్పుడప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటోంది.
తాజాగా మరోసారి తన వ్యాఖ్యలతో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Dhanush Son: ఫస్ట్ టైమ్.. కొడుకుతో కలిసి దుమ్మురేపిన ధనుష్.. డాన్స్ వీడియో వైరల్!
11 ఏళ్ల నుంచి వస్తున్న బిగ్ బాస్ ఆఫర్!
తనుశ్రీ దత్తా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని బిగ్ బాస్ రియాలిటీ షోపై ఆసక్తికర విషయాలు తెలిపింది. గత 11 సంవత్సరాలుగా బిగ్ బాస్ టీమ్ తనను సంప్రదిస్తుండగా, తాను ఒక్కసారి కూడా ఆ షోకు ఓకే చెప్పలేదని చెప్పింది.
“నాకు బిగ్ బాస్ షోంటే అసలు ఇష్టం ఉండదు. నాకు నా ప్రైవసీ చాలా ముఖ్యం. నేను నా ఫ్యామిలీతో కూడా ఎక్కువ సమయం గడపను. అలాంటప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో ఉంటానా? వాళ్లు నాకు ₹1.65 కోట్లు ఆఫర్ చేశారు. నా స్థాయి నటి ఒకరు అదే రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకుందని విన్నాను. అయినా నేను ‘నో’ చెప్పాను” అంటూ ఆమె తెలిపారు.
Also Read: సుధీర్ బాబు 'జటాధర' వచ్చేదప్పుడే ..!
“అలాంటి షో నాకు అవసరం లేదు”
తనుశ్రీ మాట్లాడుతూ, “ఆ షోలో మగవాళ్లు, ఆడవాళ్లు ఒకే హాలులో పడుకుంటారు, గొడవ పడతారు. అది నా స్టైల్ కాదు. నేను ఒక మనిషితో ఒకే బెడ్‌పై పడుకునేంత చీప్ కాదు. నాకు నా స్వతంత్రత చాలా విలువైనది. నేను ప్రశాంతంగా ఉండే చోట పనిచేస్తే, ఆ షోలో ఇచ్చినదాని కన్నా ఎక్కువ సంపాదించగలను” అని చెప్పింది.
బిగ్ బాస్ షో పద్ధతులపై ఆమె తీవ్రంగా విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. చాలా మంది ఆఫర్ కోసం ఎదురు చూస్తుంటే, తనుశ్రీ మాత్రం ఈ విధంగా స్పందించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది.
Also Read: వైజాగ్ లో అల్లు అర్జున్ AAA సినిమాస్.. ఓపెనింగ్ ఎప్పుడంటే..?
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీగా షేర్ అవుతున్నాయి. కొందరు నెటిజన్లు “ఇంత డబ్బు ఆఫర్ చేసినా తిరస్కరించిందంటే, ఆమె నిజంగా తన విలువలు పాటిస్తోంది” అంటూ ప్రశంసిస్తున్నారు. మరికొందరు మాత్రం “ఇన్ని అవకాశాలు అందరికీ రావు, అలాంటి ఆఫర్‌ను రిజెక్ట్ చేయడం అహంకారం” అని కామెంట్లు చేస్తున్నారు. ఇది కాస్త వివాదాస్పద అంశంగా మారింది. తాను బిగ్ బాస్ షోలో పాల్గొనలేనని ఓపెన్‌గా చెప్పిన తారగా తనుశ్రీ మరోసారి హైలైట్ అవుతోంది.
Also Read: Horror Movie: ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న హారర్ మూవీ! ఒక్క సీన్ కూడా వదలరు!