/rtv/media/media_files/2025/04/14/l7asmfleJ5jZSh73xAtc.jpg)
Love Insurance kompany
Love Insurance kompany: తమిళ హీరో ప్రదీప్ రంగనాథ్(Pradeep Ranganathan) ‘డ్రాగన్’(Dragon Movie) భారీ హిట్ తో ఫుల్ జోష్ లో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ప్రదీప్ నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read: సిన్సియర్ కాప్‌కి విలన్‌గా మమ్ముట్టి..?
మలేషియాలో షూటింగ్..
ఈ చిత్రంలో హీరోయిన్‌గా టాలెంటెడ్ బ్యూటీ కృతి శెట్టి(Kriti Shetty) నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మలేషియాలో జరగుతోంది. తాజా షెడ్యూల్‌లో ప్రదీప్, కృతి ఇద్దరూ పాల్గొంటున్నారు. అయితే, ఈ షెడ్యూల్‌లో పాట చిత్రీకరణ జరుగుతోందా? లేదా కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
Also Read: 10 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన తోడేళ్లు మళ్లీ తిరిగొస్తున్నాయ్..!!
ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీకి అనిరుధ్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయనున్నాడు. ఇప్పటికే ప్రాజెక్టుపై మంచి బజ్ ఏర్పడింది. విఘ్నేష్ శివన్ కథను నేటి యువతకి దగ్గరగా ఉండేలా ప్రెజెంట్ చేయబోతున్నారని టాక్.
Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..
సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో, మేకర్స్ ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసి థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ సినిమా కథ, నటీనటుల కాంబినేషన్, సంగీతం అన్నీ కలిపి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుందని మూవీ టీమ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.