Aishwarya Ragupathi : స్లీవ్ లెస్ బ్లౌజ్ పై ప్రశ్న..రిపోర్టర్కు ఇచ్చిపడేసిన నటి

స్లీవ్‌లెస్‌ దుస్తులపై ఓ రిపోర్టర్‌ ప్రశ్నించడంతో ఐశ్వర్య ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ సినిమా కార్యక్రమంలో తన దుస్తులపై చర్చ ఎందుకంటూ ప్రశ్నించింది. ప్రస్తుతానికి ఎలా స్పందించాలో తనకు అర్థం కావడం లేదంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

New Update
Aishwarya Ragupathi

తమిళ నటి, యాంకర్ ఐశ్వర్య రఘుపతికి చేధు అనుభవం ఎదురైంది.  ఆమె స్లీవ్‌లెస్‌ బ్లౌజ్ పై ఓ రిపోర్టర్‌ ప్రశ్నించడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరోయిన్ సాయి ధన్సిక నటించిన యోగిదా ఈవెంట్‌కు హాజరైన ఐశ్వర్య.. సమ్మర్ లో వేడిని తట్టుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని మీడియాను కోరారు. ‍అయితే దీనికి ప్రతిస్పందనగా ఒక రిపోర్టర్ ఆమెను ప్రశ్నించాడు. మీరు ధరించిన స్లీవ్‌లెస్ బ్లౌజ్ కూడా వేడిని తట్టుకునే ప్రణాళికలో భాగమేనా అని ప్రశ్నించాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన ఐశ్వర్య.. ఒక సినిమా కార్యక్రమంలో తన దుస్తులపై చర్చ ఎందుకంటూ నిలదీసింది. ప్రస్తుతానికి ఎలా స్పందించాలో తనకు అర్థం కావడం లేదంటూ అక్కడితో ఆపేసింది.  

అయితే దీనిపై ఆమె ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. నేటికి కూడా మన సమాజంలో చాలా మంది పురుషులు అహంకారం, దురభిమాన భావనను కలిగి ఉండటం నిరాశ కలిగించే అంశమంటూ ఆవేదన వ్యక్తం చేసింది.  ఒక రిపోర్టర్ లాంటి వ్యక్తి నుంచి అలాంటి ప్రవర్తన వచ్చినప్పుడు మరింత నిరాశకు గురి చేసిందన్నారు. ఈ విషయాన్ని మీరు గ్రహించాలని ఆమె రాసుకొచ్చారు.  ధనుష్ నటించిన 2024 చిత్రం కెప్టెన్ మిల్లర్‌లో ఐశ్వర్య కనిపించింది.

Also Read: 'శుభం' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సమంత.. చీర లుక్‌ అదిరింది! (ఫోటోలు)

ఐశ్వర్య రఘుపతికి  ఇలాంటి చేధు అనుభవాలు జరగడం ఇదేం తొలిసారి కాదు. గతంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ నటుడు తనకు దండలు వేయడానికి ప్రయత్నించేటప్పుడు హద్దులు మీరి వ్యవహరించాడు. ఆ సంఘటన తనను మానసికంగా ప్రభావితం చేసిందని ఐశ్వర్య వెల్లడించింది.  

Also Read: రూ.20 వేలలోపు ఇంతకన్నా మంచి ఫోన్లు చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ రా!

Also Read: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణులు - టాప్ 5 లిస్ట్ ఇదే!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు