/rtv/media/media_files/2025/03/14/JfXLHKRTrBEbEeQLb8sC.jpg)
Tamannaah Bhatia VIJAY VARMA AT HOLI EVENT
Tamannaah Bhatia: గత రెండేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్న నటి తమన్నా- విజయ్ వర్మ బ్రేకప్ చెప్పుకున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. త్వరలో పెళ్లి చేసుకుంటారని అనుకున్న ఈ జంట విడిపోయారని తెలియడంతో అంతా షాకయ్యారు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి ఒకే చోట కనిపించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Also Read: అత్యంత దయనీయంగా శ్రీతేజ్ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి
హొలీ వేడుకల్లో తమన్నా- విజయ్
తాజాగా తమన్నా- విజయ్ ఒకే చోట హొలీ సంబరాల్లో పాల్గొన్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వీరిద్దరూ కలిసి కాకుండా వేర్వేరుగా అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. నటి రవీనా నివాసంలో జరిగిన హొలీ వేడుకల్లో విడివిడిగా పాల్గొన్నారు. అక్కడ ఫొటోగ్రాఫర్లకు హయ్ చెబుతూ, హొలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కనిపించారు. బ్రేకప్ రూమర్ల వేళ వీరిద్దరూ ఒకే కార్యక్రమంలో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో వీరిద్దరి ఇంకా రిలేషన్ ఉన్నారా? లేదా బ్రేకప్ వార్తలన్నీ పుకార్లేనా ? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: రాజలింగం హత్య వెనుక కేసీఆర్, కేటీఆర్, హరీశ్.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు!