/rtv/media/media_files/2025/04/27/KotII2UMUb7Qv9vATGrj.jpg)
hero vijay thalapathy
Viral Video: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. అయన ఎక్కడికి వెళ్లిన అయన చూడడానికి వేల సంఖ్యల్లో అభిమానులు వస్తుంటారు. కొంతమంది మంది అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగడానికి, దగ్గరకు వెళ్లి చూడడానికి అత్యుత్సాహం చూపిస్తుంటారు. ఇటీవలే విజయ్ రాజకీయ ప్రచార కార్యక్రమంలో ఓ అభిమాని ఇలాంటి పనే చేశాడు. విజయ్ ని కలిసేందుకు ప్రాణాలనే రిస్క్ చేశాడు. ఏకంగా చెట్టుపై నుంచి విజయ్ వ్యాన్ పైకి దూకాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలేం జరిగిందో ఇక్కడ తెలుసుకోండి..
#WATCH | திடீரென மரத்தில் இருந்து தாவிய தொண்டர்.. பதறிப் போன தவெக தலைவர் விஜய்#SunNews | #TVKVijay | #Coimbatore pic.twitter.com/kMMeznkNaE
— Sun News (@sunnewstamil) April 26, 2025
చెట్టు పై నుంచి
అయితే విజయ్ శనివారం కోయంబత్తూరులో తన కొత్త పార్టీ 'తమిళగ వెట్రి కళగం' తరుపున ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో విజయ్ వ్యాన్ పై నిలబడి ప్రజలకు చేయి ఊపుతూ అభివాదం చేశారు. ఇంతలో ఓ అభిమాని విజయ్ ని కలవాలనే అత్యుత్సాహంతో చెట్టు మీద నుంచి వ్యాన్ పైకి దూకాడు. అతడి ప్రవర్తనకు విజయ్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత ఆ అభిమానిపై పై పార్టీ కండువా కప్పి.. మాట్లాడి పంపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు నుంచి రకరకాల విమర్శలు వస్తున్నాయి. కొందరు 'ఇది పిచ్చితనం' అని కామెంట్ చేయగా.. మరికొందరు 'ఇలా చేయడానికి ముందే ప్లాన్ చేశారు' అని అంటున్నారు.
ఇదిలా ఉంటే హీరో విజయ్ ప్రస్తుతం 'జన నాయగన్ ' సినిమా చేస్తున్నారు. ఇదే విజయ్ చివరి సినిమా కాబోతుందని సమాచారం. ఆ తర్వాత విజయ్ పూర్తిగా తన రాజకీయ పార్టీ పై ద్రుష్టి పెడతారని టాక్. హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుంది.
telugu-news | latest-news | cinema-news | thalapathy-vijay | viral-video