Sunny Leone Mandira
Sunny Leone Mandira:
విజన్ మూవీ మేకర్స్ కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కెనడా బ్యూటీ సన్నీలియోన్ నటించిన లేటెస్ట్ హర్రర్ కామెడీ 'మందిర'. ఈ చిత్రాన్ని ఆర్ యువన్ తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. తాజాగా మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రం నవంబర్ 22న విడుదల కానున్నట్లు తెలియజేశారు. కామెడీ హారర్ అంశాలతో రూపొందిన ఈ చిత్రంలో సన్నీలియోన్ యువరాణి పాత్రలో కనిపించనుంది. ప్రముఖ హాస్య నటుడు యోగిబాబు కీలక పాత్ర పోషించారు. జావేద్ రియాజ్ సంగీతం అందించగా.. దీపక్ డి మీనన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.
Also Read: 'పుష్ప 2' విషయంలో దేవీకి దెబ్బేసిన సుకుమార్.. ఇక కెరీర్ కష్టమేనా..!
The wait is over! #MandiraMandira full video song featuring @SunnyLeone is out now!
— Ramesh Bala (@rameshlaus) October 31, 2024
Dive into the beats, catch the glam. Watch it now! 🎶✨https://t.co/OlfOUVizZl#RYuvan #KommalapatiSridhar Presents@kommalapatisai #KRavindraKalyan #SriSai @Viisionmovie@javeddriaz… pic.twitter.com/gr8yHtoF49
Also Read: ముదురుతున్న మెగా యుద్ధం.. బన్నీకి వరుణ్‌తేజ్ కౌంటర్‌తో మరోసారి రచ్చ రచ్చ!
సన్నీలియోన్ హిందీతో పాటు, తెలుగు, తమిళ్ చిత్రాల్లో తన డాన్స్, నటనతో స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. తెలుగులో కరెంట్ తీగ, పీఎస్‌వీ గరుడ వేగ, జిన్నా సినిమాలతో సిల్వర్ స్క్రీన్ పై అలరించింది. దాదాపు 2 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ 'మందిర' మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
Also Read: మాటలకు కొత్త పుంతలు తొక్కించాడు.. టాలీవుడ్ మనసును గెలిచాడు.. మాటల మాంత్రికుడి బర్త్ డే స్పెషల్!